అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్‌ను కలిసిన నందమూరి బాలకృష్ణ అభిమాని.. ఎక్కడ? ఎప్పడు?!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో అర్జెంటీనాకు పూర్వ వైభవం తెచ్చిన ఆ దేశ గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్‌ను నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమాని కార్తీకేయ పాడి కలుసుకొన్నారు. 1986లో ప్రఖ్యాత పుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనా ప్రపంచ కప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడం తెలిసిందే. అప్పటి నుంచి అర్జెంటీనాకు ప్రపంచ కప్ అందని ద్రాక్షగానే మారింది.
తాజాగా 2022లో ఖతార్‌లో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో అర్జెంటీనా టైటిల్ సాధించడం వెనుక ఎమిలియానో మార్టినెజ్ కృషి ఎంతైనా ఉంది. అలాంటి మార్టినెజ్ ప్రస్తుతం కోల్‌కతాలో పర్యటించిన సమయంలో కార్తీకేయ ఆయనను కలుసుకోవడం విశేషంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఫిఫా ఫైనల్‌లో పోటాపోటీగా జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ ఓ దశలో 3-3 స్కోర్‌తో సమంగా నిలిచాయి. ఆ సందర్భంగా ఆటలో జరిగిన పెనాల్టీ షూట్ అవుట్ ఫ్రాన్స్ పెనాల్టీ కిక్‌ను ఎమిలియానో మార్టినేజ్ నిలువరించడంతో విజయం అర్జెంటీనాకు దక్కింది. ఖతార్‌లో ప్రపంచ కప్‌లో అద్బుతమైన విజయం సాధించిన తర్వాత సొంత దేశంలోనే కాకుండా భారత్‌లో విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. తాజాగా జూలై 4, 5 తేదీలలో కోల్‌కతాలోని మోహన్ బగాన్ క్లబ్‌లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి మార్టినెజ్ హాజరయ్యారు.
అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కోల్‌కతాలో పర్యటిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొన్న కార్తికేయ పాడి అక్కడికి వెళ్లారు. తనకు ఇష్టమైన ఆటగాడిని కలుసుకోవడంతోపాటు 2022 ప్రపంచ కప్ నమూనాను పట్టుకొని మార్టినెజ్‌తో ఫోటో దిగాడు.
అంతేకాకుండా అర్జెంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకొన్నాడు. అనంతరం మార్టినెజ్‌ను కలిసిన విషయాన్ని మీడియాతో పంచుకొన్నారు. నాకు అత్యంత ఇష్టమైన క్రీడాకారుడు మార్టినెజ్‌ను కలవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు జీవితం ధన్యమైన ఫీలింగ్ కలిగింది. ఆయన రిసీవ్ చేసుకొన్న విధానం మరిచిపోలేనిది. ఆ క్షణాలు అద్బుతమైన అని కార్తీకేయ తన ఆనందాన్ని పంచుకొన్నారు.

కార్తీకేయ పాడి వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. ఫుట్‌బాల్ ప్లేయర్ మాత్రమే కాకుండా మ్యూజిక్ రంగంలో రాణిస్తున్న వర్థమాన కళాకారుడు. లండన్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి వోకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాడు.అంతేకాకుండా నటనపై కూడా ఆసక్తి ఉంది. నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంలో బాలకృష్ణతో నటించే అవకాశం లభించింది. కానీ పరీక్షల కారణంగా నటించలేకపోయాడు.
బాల్యం నుంచి నందమూరి బాలకృష్ణను అభిమానించే కార్తీకేయ పాడి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. నర్సాపూర్‌లోని డాక్టర్ బీవీ రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరిం్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసించడం నా ప్రథమ కర్తవ్యం. బాలకృష్ణ కోసం పాట పాడాలన్నది నా ధ్యేయం అని కార్తీకేయ పాడి అన్నారు.


Click it and Unblock the Notifications











