బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్.. స్టార్ హీరోతో స్పెషల్ ఫొటో వైరల్.. రాబోయేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విదంగా మన స్టార్ హీరోలు సరికొత్త తరహాలో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా హోస్టింగ్ బాధ్యతలను చాలా ఆహ్లాదకరంగా నిర్వర్తిస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అంటూ ఓటీటీ ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని అందించారు. అయితే ప్రస్తుతం ఆ టాక్ షో తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది.

సరికొత్త ఎంటర్టైన్మెంట్
నందమూరి బాలకృష్ణ కేవలం హీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా మెప్పిస్తాడు అని ఆహో అన్‌స్టాపబుల్ తో చాలా క్లారిటీ గా అర్థమైంది. అయితే ఆ షోలో కి ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు దర్శకులు కూడా వచ్చారు. మంచు ఫ్యామిలీతో మొదటి ఎపిసోడ్ ను ప్రారంభించిన బాలయ్య ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. షూటింగ్ లకు ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కూడా ఈ షోలో పాల్గొంటూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.

సన్నిహితంగా ఉండే వారితో..
నాచురల్ స్టార్ నాని తో కూడా నందమూరి బాలకృష్ణ చాలా ఓపెన్ గా అనేక రకాల విషయాలపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆయనతో సన్నిహితంగా ఉండే మిగతా స్టార్స్ కూడా ఆ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. బ్రహ్మానందం అనిల్ రావిపూడి తో పాటు అఖండ చిత్ర యూనిట్ సభ్యులు కూడా షో లో సందడి చేసిన విషయం తెలిసిందే.

బాలకృష్ణతో గోపిచంద్, రవితేజ
ఇక ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి అలాగే సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి కూడా బాలయ్య తో ప్రత్యేకంగా షోలో పాల్గొనడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల మాస్ మహారాజా రవితేజ క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పాల్గొన్నట్లు ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఎపిసోడ్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో తన తదుపరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ బాబుతో ఫైనల్
అల్లు అర్జున్ తో కూడా ఇటీవల షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఆ ఎపిసోడ్ డిసెంబర్ 25వ తేదీన ప్రసారం కానుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ కూడా పూర్తి అయినట్లుగా టాక్ అయితే వస్తుంది. ఆ ఫైనల్ ఎపిసోడ్ కో రాబోయే ది మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని మరోసారి ఆహా నుంచి ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణతో మహేష్ బాబు ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు?
మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఆ ఎపిసోడ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ ప్రతి సెలబ్రిటీని కూడా వారి జీవితంలోని అనేక రకాల కాంట్రవర్సీ విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ జోలికి వెళ్ళని మహేష్ బాబును ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











