బాలయ్య కారుకు ఫాన్సీ నెంబర్.. ఎన్ని లక్షలు చెల్లించారో తెలుసా?

నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం నియోజకవర్గ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేశారు. ఆరు పదుల వయస్సు లోనూ బాలకృష్ణ వరుస చిత్రాలతో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో బాలయ్య థియేటర్లలో దుమ్ము లేపుతుండటంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతున్నారు. చివరిగా 'వీర సింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకూ మహారాజ్' వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.

ఇప్పటికీ 64 ఏళ్ల లోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఉన్నారు. డ్యాన్స్ లు, యాక్షన్ సీన్లతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రజా ప్రతినిధిగా కూడా ప్రజా సేవకు తన వంతు కృషి చేస్తున్నారు. ఏపీలోని అధికార టీడీపీ తరుపున హిందూపురం నియోజకవర్గం నుంచి నాలుగోవ సారి వరుసగా శాసన సభ్యుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇలా ఓవైపు సినిమాలు, మరోవైపు ప్రజా పాలనలో యాక్టివ్ గా ఉంటూ క్రీయశీల పాత్రలు పోషిస్తున్నారు. కాగా తాజాగా బాలయ్య పేరు వార్తల్లో నిలిచింది.

Nandamuri Balakrishna Got Fancy number with Big Paying to his Car

అందుకు కారణంగా తాజాగా హైదరాబాద్ లోని ఆర్టీఏ ప్రభుత్వ సంస్థ నిర్వహించిన వేలం పాటతో బాలకృష్ణ పేరు మారుమోగింది. ఆర్టీఏ సంస్థ తాజాగా కొన్ని ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట నిర్వహించింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని బడా వ్యాపారవేత్తలు ఆ వేలంలో పాల్గొన్నారు. 0001 అనే నెంబర్ కోసం భారీ ఎత్తున వేలం జరిగింది. కానీ బాలకృష్ణ ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వలేదు. ఏకంగా రూ.7.75 లక్షలు ఖర్చు చేసి ఆ ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నారు. ఏడు నెంబర్లకు వేలం పాడినట్లు తెలుస్తోంది.

0001, 0005, 0007, 0009, 0019, 0099, 9999 నెంబర్లకు ఆర్టీఏ అధికారులు వేలం నిర్వహించారు. అయితే మొదటి నెంబర్ ను హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలయ్య భారీ ధరకు దక్కించుకున్నారు. ఆ తర్వాత 0009 ఫ్యాన్సీ నెంబర్ ను హైదరాబాద్ బేస్డ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రూ. దక్కించుకున్నారు. 0099 నెంబర్ ను రూ.4.75 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నెంబర్లన్నీ రూ.60 వేలతో బిడ్డర్స్ సొంతం చేసుకున్నారు. దీంతో ఫ్యాన్సీ నెంబర్లకు ఎంత ఆసక్తి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

మరో వైపు నందమూరి బాలయ్యకు కూడా ఫ్యాన్సీ నంబర్ పై ఇంట్రెస్ట్ ను కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇక మొత్తం వేలం ద్వారా హైదరాబాద్ రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)కు రూ.37.15 లక్షల వరకు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. మొత్తానికి ఈ వేలం పాటలో హైదరాబాద్ లోని బడా వ్యాపార వేత్త లతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొనడం ఆసక్తి కరంగా మారింది. మొత్తానికి భారీ ధరతో 0001 ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నారు. కెరియర్ లో నెంబర్ వన్ గా నిలిచిన బాలయ్య అన్నీ విషయాల్లోనూ నెం.1గా ఉండాలని అనుకునేందుకే సింబాలిక్ గా ఈ ఫ్యాన్సీ నెంబర్ ను కొనుగోలు చేశారని అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X