కృష్ణ ఫ్యామిలీతో విడదీయలేని బంధం.. మహేష్‌కు అండగా ఉంటా.. కృష్ణ మరణంతో బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి
తెలుగు సినిమా పరిశ్రమ నట శిఖరం సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మరణం ఎంతో మందిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన ఇకలేరనే వార్తను జీర్ణించుకొలేక కన్నీరు మున్నీరవుతున్నారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ క్రమంలో సినీ తారలందరూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొంటటున్నారు. కృష్ణ మరణంపై నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సంతాప ప్రకటనను విడుదల చేస్తూ...
ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి అని బాలకృష్ణ అన్నారు.

కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని బాలకృష్ణ పేర్కొన్నారు.
ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ తన సంతాప ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











