లేటు వయసులో పెద్ద రిస్క్ చేసిన బాలయ్య.. నందమూరి హీరో చేసిన పనికి వాళ్లంతా షాక్.!

By Manoj Kumar P

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని ప్రత్యేకమైన శైలితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. అదే సమయంలో ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు. దీంతో బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. వయసు పైబడుతున్నా.. ఏమాత్రం లెక్క చేయని ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఈ నందమూరి హీరో పెద్ద సాహసమే చేశారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ వివరాలు మీకోసం.!

వరుస ఫ్లాపులతో బాలయ్య సతమతం

వరుస ఫ్లాపులతో బాలయ్య సతమతం

నందమూరి బాలకృష్ణ కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. ఆ మధ్య వచ్చిన ‘సింహా', ‘లెజెండ్', ‘గౌతమిపుత్ర శాతకర్ణి', ‘జై సింహా' మినహా ఆయన చేసిన చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి. మరీ ముఖ్యంగా పోయిన సంవత్సరం బాలయ్య నటించిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

మళ్లీ ఆయనపైనే ఆశలు పెట్టుకున్నాడు

మళ్లీ ఆయనపైనే ఆశలు పెట్టుకున్నాడు

చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలకృష్ణ ఈయనతోనే సినిమా చేస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాపైనా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకునేందుకు చిత్ర యూనిట్ పని చేస్తోంది.

 ఎన్నో ఆటంకాల నడమ మొదలు పెట్టారు

ఎన్నో ఆటంకాల నడమ మొదలు పెట్టారు

వాస్తవానికి ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. కానీ, దీనిని ఆపేసి కేఎస్ రవికుమార్‌తో ‘రూలర్' అనే సినిమా చేశారు బాలయ్య. దీని తర్వాత అంటే ఈ మధ్యే బోయపాటి శ్రీను సినిమా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో అయినా.. పలు ఆటంకాల కారణంగా సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.

వాళ్ల గురించి సమాచారం రావడం లేదు

వాళ్ల గురించి సమాచారం రావడం లేదు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, ఏ విషయంలోనూ క్లారిటీ మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా ఇందులో నటించే హీరోయిన్ గురించి చాలా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ, సరైన సమాచారం మాత్రం లీక్ కాలేదు.

లేటు వయసులో పెద్ద రిస్క్ చేసిన బాలయ్య

లేటు వయసులో పెద్ద రిస్క్ చేసిన బాలయ్య

ఈ సినిమాలో నందమూరి హీరో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఓ పాత్ర వారణాశి సమీపంలో ఉండే అఘోరాది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య గురించి ఓ షాకింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం... ఇందులోని అఘోరా పాత్ర కోసం ఆయన ఏకంగా 25 కేజీల బరువు తగ్గారట.

Recommended Video

Balakrishna Gives Strong Warning To YSRCP | నా మౌనం భయంకరం | Filmibeat Telugu
నందమూరి హీరో చేసిన పనికి వాళ్లంతా షాక్.!

నందమూరి హీరో చేసిన పనికి వాళ్లంతా షాక్.!

నిజానికి బాలయ్య తన గత చిత్రం ‘రూలర్'లోనే ఎంతో స్మార్ట్ లుక్‌లో కనిపించారు. ఇప్పుడు దాని కంటే బరువు తగ్గారని తెలుస్తోంది. బోయపాటి చెప్పిన కథకు అనుగుణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇందుకోసం రోజుకు మూడు గంటల పాటు జిమ్ చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X