హీరో శ్రీకాంత్‌ను హెచ్చరించిన బాలకృష్ణ.. జాగ్రత్త మళ్ళీ రిపీట్ అయితే బావుండదు అంటూ..
నందమూరి బాలకృష్ణలో ఒక స్టార్ హీరోతో పాటు ఒక మంచి మనసున్న నాయకుడు కూడా ఉన్నాడని అందరికి తెలిసిందే. ఆయన 60 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ ఎనర్జి మాత్రం నేటి కుర్రాళ్ళ కంటే హై లెవెల్లో ఉంటుంది. బాలయ్య కనిపిస్తేనే అందరిలో ఒక వైబ్రేషన్ పాస్ అవుతుంది. ఇక ఆయన తిట్టి చెప్పినా కూడా అందులో ప్రేమ ఉంటుంది. ఇటీవల శ్రీకాంత్ ను ఒక విషయంలో గట్టిగానే హెచ్చరించారట. మళ్ళీ రిపీట్ కూడా కావద్దని కౌంటర్ ఇచ్చినట్లు బాలయ్య ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గానే వివరణ ఇచ్చారు.

అభిమానులకు నచ్చేలా
నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానులకు నచ్చేలా తీయాలని అనుకుంటారు. ఫ్యాన్స్ కు మాస్ మసాలా ఎలివేషన్స్ ఉన్నాయా లేవా అని స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. సినిమాలో డైలాగ్స్ ఫైట్స్ చూసి అభిమానులు ఆనంద పడాలని కోరుకుంటారు.

ఆప్యాయంగా పలకరించారు
ఇక ఇటీవల పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో వైద్య సిబ్బందితో కలిసి పుట్టినరోజు వేడుకలను జరువుకున్నారు. అంతే కాకుండా క్యాన్సర్ పేషేంట్స్ ను కూడా ఆప్యాయంగా పలకరించారు. వారికి ప్రత్యేకమైన కానుకలు కూడా ఇచ్చి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు.

శ్రీకాంత్ అలా చేస్తున్నాడని..
ఇక పుట్టినరోజున ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ హీరో శ్రీకాంత్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా శ్రీకాంత్ విలన్ గా చేయడానికి కూడా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే నాగచైతన్య యుద్ధం శరణం సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించారు.

హెచ్చరించిన బాలకృష్ణ
ఇక ఆ విషయంలో బాలయ్య శ్రీకాంత్ ను హెచ్చరించాడట. మళ్ళీ విలన్స్ రోల్ చేయడానికి వీల్లేదు. ఇంకా దానికి టైమ్ ఉంది. మళ్ళీ హీరోగా చేయండి అని హెచ్చరించాను అంటూ బాలకృష్ణ ఓపెన్ గా వివరణ ఇచ్చారు. అవసరం అయితే తాను కొన్ని సినిమాలను సజెస్ట్ చేస్తానని కూడా అన్నారట.

జాగ్రత్త.. రిపీట్ చేయకు
శ్రీకాంత్ కోసం ఒక దర్శకుడిని పంపి సినిమా కూడా సెట్ చేయించినట్లు చెబుతూ.. ఇక మరోసారి విలన్ గా చేయాలని చూస్తే బావుండదు. జాగ్రత్త.. రిపీట్ చేయకు అంటూ బాలకృష్ణ గట్టిగానే చెప్పారట. ఆ విధంగా కోపంతో కూడా ప్రేమను చూపించగల బాలకృష్ణ మంచి కాన్సెప్ట్ తో వస్తే వెబ్ సిరీస్ కూడా చేయడానికి సిద్ధమే అని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











