Balakrishna: నందమూరి వారసుడు జూ ఎన్టీఆర్ కాదా? బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నట వారసుడిగా తెలుగు సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఆర్మీని క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడి వరకు అంత బాగానే అప్పుడప్పుడూ క్రేజీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఐఫా (IIFA) వేడుకలు పాల్గొన్న నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. నందమూరి నట వారసుడు ఎవరనే విషయంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారో మీరు కూడా ఓ లూక్కేయండి.

నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ళ నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే టాలీవుడ్ భారీ ఈవెంట్ నిర్వహించింది. నటసింహం బాలయ్య తన నట జీవితంలో ఎన్నో అవార్డులు అందుకోగా తాజాగా మరో ప్రతిష్మాతక అవార్డు అందుకున్నారు. దుబాయి రాజధాని అబుదాబీ వేదికగా నిర్వహిస్తోన్న ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. బాలయ్య హీరోగా 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని సినీ పరిశ్రమ తరుపున ఘనంగా సన్మానించారు. ఐఫా తరపున బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు అందచేశారు. ఈ అవార్డును బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా అందచేశారు బాలకృష్ణ.

Nandamuri Balakrishna made sensational comments about who is the successor of actor Nandamuri Taraka Rama Rao

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన సినీ ప్రస్థానంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఐఫా వేడుకల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందనీ, తన 50 ఏళ్ళ నట ప్రస్థానానికి ఐఫా నాకు గోల్డెన్ లెగసి అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. నాటి తోటి స్టార్స్ తో మంచి స్పోర్టివ్ కాంపిటేషన్ ఉంటుందనీ, తాను ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తానని బాలకృష్ణ తెలిపారు. అలాగే.. తన కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఏంట్రీ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమవుతుందని చెప్పకనే చెప్పారు. మరీ మోక్షజ్ఞ తొలి సినిమా కథ ఎలా ఉండబోతుందని ప్రశ్నించగా.. బాలయ్య తనదైన శైలిలో దానికి ఎలా లీక్ చేస్తామంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.

ఈ తరుణంలో తెలుగులో సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాల విషయాలను గుర్తుచేసుకున్నారు. అఖండతో తెలుగులో హిందుత్వ సినిమాలకు దిశా నిర్ధేశం చేసిందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కరోనా సమయంలో అందరు భయపడుతుంటే.. ఆ సమయంలో ధైర్యంగా మూవీని విడుదల చేసి విజయం సాధించామన్నారు. ఆ తరువాతనే మిగతా మూవీ మేకర్స్ తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు ముందుకు వచ్చారని కరోనా నాటి మూవీ కష్టాలను గుర్తు చేశారు నందమూరి బాలకృష్ణ.

Nandamuri Balakrishna made sensational comments about who is the successor of actor Nandamuri Taraka Rama Rao

ఈ సమయంలో నందమూరి తారక రామారావు వారసులు బాలకృష్ణ, మరీ బాలకృష్ణ నట వారసులు ఎవరు? ప్రశ్నించగా.. వెంటనే రియాక్ట్ అయిన బాలయ్య ' నా కొడుకు మోక్షజ్ఞ.. నా మనుమళ్లు.. ఇంకెవరున్నారు' అని షాకింగ్ సమాధానమిచ్చారు. మోక్షజ్ఞ క్రమశిక్షణతో నటనలో ట్రెనింగ్ తీసుకుంటున్నారనీ, తనని తాను ప్రూవ్ చేసే చేసుకోవాలన్నారు. అయినా తాను ఉండగా ఆ విషయంతో ఎలాంటి టెన్షన్ లేదన్నారు. వాటి కెరీర్ విషయంలో తాను ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నన్నారు. అలాంటి నందమూరి తారక రామారావు దీవెనలు వాటిపై ఉన్నాయని అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే.. ఈ సమయంలో తన అన్నయ్య హరికృష్ణ కుమారులైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు అస్సలు ప్రస్తావించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Read more about: balakrishna jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X