గోరంతలు కొండంతలు చేయం.. 'మెగా'పై బాలయ్య సెటైర్?
నందమూరి బాలకృష్ణ.. పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన దాదాపు 50 ఏళ్లుగా వెండితెరపై వెలుగొందుతున్నారు. బాలయ్యకు కోపమని.. ఆయనతో పనిచేయడం చాలా కష్టమని బయట వినిపించే టాక్. కానీ ఆయనతో ఒకసారి పనిచేసిన వారు మళ్లీ మళ్లీ పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. క్రమశిక్షణ, సమయపాలన, చిన్నా, పెద్దా అందరినీ గౌరవించడం వంటివి బాలయ్య నుంచి నేర్చుకోవచ్చని చెబుతుంటారు.
ప్రస్తుతం నందమూరి నటసింహం మంచి ఊపులో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్‌లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదలై పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది.

తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి నేటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్ పార్టీ ఏర్పాటు చేసి ఎంజాయ్ చేసింది. అయితే సినిమాను మరింత ప్రమోట్ చేసి వసూళ్లు పెంచుకోవాలని డాకు మహారాజ్ యూనిట్ భావిస్తోంది. తమిళ్ వెర్షన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చి అక్కడా మంచి వసూళ్లు వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తానికి వరుసగా నాలుగో హిట్‌ను సొంతం చేసుకుని బాలయ్య మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇకపోతే బాలయ్య కొన్నిసార్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫేక్ కలెక్షన్స్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సినిమాకు సంబంధించిన లెక్కలన్నీ నిర్మాత దగ్గర చిట్టా ఉంటుంది. కానీ కొందరు అభిమానులు తమ హీరోని, తోటి ఫ్యాన్స్‌ని సంతోష పెట్టేందుకు గాను భారీ వసూళ్లు సాధించినట్లుగా పోస్టర్లు వేస్తుంటారు. భారీ హైప్ తెచ్చుకున్న సినిమాలు రికార్డ్ ఓపెనింగ్స్ కొడితే ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు కూడా తీసుకుంటున్నారు. కానీ హైప్ లేని సినిమాలకీ కూడా ఊహించని నెంబర్స్‌తో ఇలాంటి పోస్టర్లు ప్రకటిస్తుండటంతో అదే పెద్ద చర్చకు దారి తీస్తోంది.
సంక్రాంతికే వచ్చిన రామ్ చరణ్ - శంకర్‌ల గేమ్ ఛేంజర్ సినిమాకు ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చినట్లుగా పోస్టర్ వదలడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇదే కాదు.. గతంలో పలు సినిమాల విడుదల సమయంలోను ఇలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా స్టార్ యాంకర్‌కు సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫేక్ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొలి నుంచి నా సినిమాల రికార్డులు, రివార్డులు, నా అవార్డులు జెన్యూన్‌గా ఉంటాయని.. గోరంతను కొండంతగా చూపించే సంస్కారం నాకు లేదంటూ బాలయ్య . నా రికార్డులు, రివార్డులు అన్నీ అన్‌స్టాపబుల్ అని .. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని, చివరికి ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా సెట్‌లోని ఆహారమే తింటానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











