బాలకృష్ణ నోట ఆ మంత్రం.. ఆగిన తారకరత్న గుండెకు చలనం!
నందమూరి తారకరత్నకు గుండె గుండెపోటు రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఇక ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ప్రస్తుతం చికిత్స అందుకుంటున్నారు. ఇక ఆయన పరిస్థితి కూడా మెల్ల మెల్లగా మెరుగుపడుతుంది అని ఇంకా వైద్య పరీక్షలు కూడా చేయాల్సి ఉంది అని సన్నిహితులు తెలియజేశారు. అయితే ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ జపించిన ఒక మంత్రం గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారు అనే విషయాన్ని ప్రముఖ సిద్ధాంతి శ్రీహరి శర్మ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

బాలకృష్ణ మంత్రం
నందమూరి తారకరత్న హాస్పిటల్ లో చేర్పించినప్పుడు రోజురోజుకు అతని పరిస్థితి విషమంగా మారడంతో అప్పుడే బాలకృష్ణ తారకరత్న గారి చెవిలో మహా మృత్యుంజయ మంత్రన్ని వినిపించారు అని దాని వల్లనే ఈ రోజు ఇలా కోరుకున్నారు అని అనేక రకాల వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు.

పండితులు ఏమంటున్నారు?
ప్రముఖ సిద్ధాంతి నందిభట్ల శ్రీహరి శర్మ ఈ మహా మృత్యుంజయ మంత్రం గురించి ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇది చాలా శక్తివంతమైనది. ఈశ్వరుడే ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన మంత్రాలను మనకు ప్రసాదించారు. అందులోనిది మహా మృత్యుంజయ మంత్రం ఒకటి. ఇది ఋగ్వేదంలో చెప్పబడింది. ఏడవ మండలంలో 59వ స్తోత్రం 12 మంత్రంగా మృత్యుంజయ మంత్రులని చెప్పబడింది.. అని అన్నారు.

వినికిడి ద్వారానే..
కొన్ని మంత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయి వాటి శబ్ద తరంగాలతో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అప్పుడు మహా మృత్యుంజయ మంత్రాన్ని చెవిలో చెప్పినప్పుడు వినికిడి ద్వారానే ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అది చాలా శక్తివంతమైనది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ విధంగా కరుణ చూపిస్తాడు అని నందిబట్ల శ్రీహరి శర్మ తెలియజేశారు.

ఆ మంత్రం చాలా గొప్పది
నరసింహ స్వామి పరమేశ్వర స్వామి ఆంజనేయుడు ఈ ముగ్గురు యొక్క అంశంలో ఆ మంత్రంలో ఉంటుంది. మృత్యుంజయ మంత్రంలో అమృత మృత్యుంజయ మంత్రం అనేది చాలా గొప్పది దాని శక్తి కూడా ఎవరూ వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ మంత్రాన్ని దాదాపు రెండు సందర్భాల్లో ఆపదలో ఉన్న వ్యక్తికి ఉపయోగిస్తారు అని వివరణ ఇచ్చారు.

ఆ విలువ బాలకృష్ణకు తెలుసు
దాని విలువ తెలుసుకోబట్టే నందమూరి బాలకృష్ణ గారు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన శాస్త్రాలను మర్చిపోలేదు. ఇక ఎంతో నమ్మకంతో అయినా కొడుకు బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ చెవులో వినిపించారు. అదే తారకరత్నకు ఆయుష్షుని పోసింది. వీలైనంతవరకు మృత్యుంజయ హోమాన్ని చాలా నిష్టతోనే పఠించాల్సి ఉంటుంది. అప్పుడే దాని ఫలితం దక్కుతుంది అని శ్రీహరి శర్మ తెలియజేశారు. అంతే కాకుండా దీనికి సమయం రోజులని ఏమీ లేవు అని మనిషి అపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు అని కూడా హిందూ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











