నర్తనశాల ట్రైలర్.. బాలయ్య మ్యాజిక్ చేసేశాడు!!

నందమూరి బాలకృష్ణకు పౌరాణిక చిత్రాలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఓ లెక్కన చూస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో పౌరాణిక పాత్రాలను రక్తి కట్టించేవారో బాలయ్యే ఘనడు. అందులో బాలయ్యను ఢీ కొట్టేవారెవ్వరూ లేరు. అలాంటి బాలయ్య డ్రీం ప్రాజెక్ట్ అయిన నర్తనశాల మధ్యలోనే ఆగిపోవడంపై ఎన్నోసార్లు బాధపడ్డాడట. కానీ దాన్ని మళ్లీ పున: ప్రారంభించేందుకు మాత్రం సాహసం చేయలేదట.

సౌందర్య మరణంతో నర్తనశాల ప్రాజెక్ట్ పూర్తిగా కనుమరుగైంది. అసలే సెంటిమెంట్లను నమ్మే బాలయ్య బాబు నర్తనశాలకు దూరంగానే ఉండిపోయాడట. కానీ అప్పటికే కొంత మేర షూటింగ్ చేసిన సన్నివేశాలను క్రమపద్దతిలో పేర్చి ఓ షార్ట్ ఫిలింగ్ చేసి దసరా నాడు ప్రేక్షకులకు కానుకగా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా నర్తనశాల ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను షార్ట్ ఫిలింగా రూపొందించారు.

Nandamuri Balakrishna Narthanasala Trailer Out

తాజాగా విడుదల చేసిన నర్తనశాల ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఇక ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబులను స్క్రీన్‌పై చూస్తుంటే కనుల విందుగా ఉంది. సౌందర్య, శ్రీహరి అభిమానులు వారిని చూసి ఆనందపడుతున్నారు. ఇక విజయదశమి సందర్భంగా అక్టోబరు 24న శ్రేయాస్‌ ఈటీ వేదికగా ఉదయం 11.49గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇందులో బాలయ్య పౌరాణిక డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X