NBK 109 సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్​ - బాలయ్య హంటింగ్​.. మెంటల్​ ఎక్కించేశాడు!

నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పవర్ ఫుల్ హీరోగా ఎదిగారు బాలయ్య. దాదాపు నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తాను చూపిస్తూ కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆరు పదుల వయసులోనూ బాలయ్య వరుస సినిమాలతో హిట్లు కొడుతూ జోరుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో ఎన్​బీకే 109 సినిమా చేస్తున్నారు. నేడు మాహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలోని బాలయ్య పాత్ర ఎంత మాస్​గా, క్రూరంగా ఉందో చూపించారు. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

ప్రస్తుతం టాలీవుడ్​లో ఉన్న అగ్రహీరోలలో కెరీర్​ పరంగా దూసుకెళ్తున్న హీరో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పుడు ఆయన జెడ్ స్పీడ్​గా దూసుకెళ్తున్నారు. ఓ వైపు పాలిటిక్స్ మరోవైపు సినిమాలు అంటూ ప్రొఫెషనల్​గా పీక్ స్టేజ్ ఉన్నారు. ఇతర హీరోలెవరూ ఆయన స్పీడ్​ను అస్సలు మ్యాచ్​ చేసే పరిస్థితి కనపడట్లేదనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్యకు దీటుగా ఉండే చిరంజీవి ఫ్లాపుల్లో ఉన్నారు. మరో హిట్ పడితే కానీ ఆయన పరిస్థితేంటో చెప్పలేం. నాగార్జున, వెంకటేశ్ అయితే మీడియం రేంజ్​లో కొనసాగుతున్నారు.

Nandamuri Balakrishna NBK 109 Glimpse released on Sivaratri special directed by Bobby Full Details Here

అయితే భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి,అఖండ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు ఎన్​బీకే 109 సినిమా చేస్తున్నారు. దీనిని వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ డెరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం ఒక్క అనౌన్స్​ పోస్టర్​ తప్ప ఇంకేమీ బయటకు రాలేదు. బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్​ నందమూరి అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

కానీ ఈ సినిమా స్టోరీ బ్యాక్​డ్రాప్ ఏంటి, బాలయ్య బాబు పాత్ర ఏంటనేది చెప్పకుండా దర్శకుడు బాబీ సస్పెన్స్‌ను కొనసాగిస్తూనే వస్తున్నారు. సినిమా అయితే పక్కా వేరే లెవల్​లో ఉంటుందని మాత్రం హామీ ఇచ్చారు. అభిమానుల ఊహకు మించి ఉంటుందని చెప్పారు. అయితే తాజాగా నేడు మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర టీజర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాలోని బాలయ్య పాత్ర ఎంత మాస్​గా, క్రూరంగా ఉందో చూపించారు. కల్ట్ సరుకు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

మంటలు చెలరేగిన ఊరు, అడవి, డ్యామ్​తో టైటిల్ ఇంట్రో అద్భుతంగా ఉంది. మెంటల్ మాస్ పిచ్చెక్కించింది. ఇక జనాలు, జంతువులు మంటల్లో కాలిపోతున్న తమ అడివి, ఊరు నుంచి కాపాడండి అంటూ మొరపెట్టుకుంటూ కనిపించారు. ఇంతలో జీపులో నుంచి బాలయ్య స్టైలిష్​ లుక్​లో కిందకు దిగి ఆయుధాలతో కూడిన తన టూల్​ బాక్స్ కిట్(సినిమా అనౌన్స్​మెంట్ పోస్టర్​) ఓపెన్ చేసి విలన్లపై విరుచుకుపడతారు. అలా సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్​, హంటింగ్​... బాలయ్య సీరియస్​గా విలన్లపై విరుచుకుపడటం అద్భుతంగా ఉంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ వీడియోకు తగ్గట్టు అదిరిపోయింది. గూస్​ బంప్స్ తెప్పించింది.

ఇకపోతే ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ పాత్రలో కనిపించనున్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి మరో ప్రధాన పాత్రలో నటించనుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా చిత్రంలో నటిస్తోంది. బహుశ స్పెషల్ సాంగ్​లో మెరవనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X