Balakrishna: 5 ఏళ్లలో 76 శాతం పెరిగిన బాలకృష్ణ ఆస్తుల విలువ.. నందమూరి నటసింహానికి ఎన్ని వందల కోట్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో నటసింహం నందమూరి బాలకృష్ణ గోల్డెన్ స్పూన్ పర్సన్. తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు సూపర్ స్టార్ కావడంతో ఆయనకు ఆర్థికంగా, పాపులారిటీ పరంగా ఎలాంటి లోకుండా పెరిగారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో అత్యధికంగా పారితోషికం తీసుకొనే హీరోల్లో ఒకటిగా పెరిగారు. అయితే తాజాగా ఆయన హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు ప్రకటించిన ఆస్తుల వివరాల్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోను అద్బుతంగా రాణిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో వరుసు హిట్లు సాధిస్తుండగా.. పాలిటిక్స్‌లో మూడో సారి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. అందుకోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీచేసే అభ్యర్థి తప్పనిసరిగా తమ ఆదాయవ్యయాలను కమిషన్‌కు సమర్పించాలి ఉంటుంది.

Nandamuri Balakrishna net Worth and Total assets jewellery worth as per Election Commission Affidavit

నందమూరి బాలకృష్ణ సమర్ఫించిన అఫిడవిట్ ప్రకారం. . ఆయన ఆస్తులు గత 5 ఏళ్లలో 76 శాతం పెరిగాయి. 2019 సంవత్సరంలో ఆయన ఆదాయం 274 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు ప్రకటించారు. అయితే గత ఐదు సంవత్సరాల్లో ఆయన సంపద అనూహ్యంగా పెరిగింది. ఆయన బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు.

ఇక ప్రస్తుతం ప్రకటించిన ప్రకారం.. ప్రస్తుతం ఆస్తుల విలువ 482 కోట్ల రూపాయలు. అందులో చర ఆస్తులు 283 కోట్ల రూపాయలుగా, 199 కోట్ల రూపాయలు స్థిర ఆస్తులుగా పేర్కొన్నారు. గతంలో ఎన్నికల కమిషన్‌కు చూపించిన లెక్కలతో పోల్చుకొంటే ఆయన స్థిర, చర ఆస్తులు భారీగా పెరిగాయి.

ఇక బాలకృష్ణ ఫ్యామిలీకి ఉన్న ఆభరణాల వివరాల్లోకి వెళితే.. సుమారుగా 5.9 కేజీల బంగారం, 156 కేజీల వెండి ఉంది. 580 క్యారెట్స్ వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్‌లో చూపించారు. వాటి విలువ మొత్తంగా 7 కోట్ల రూపాయల విలువగా పేర్కొన్నారు.

Nandamuri Balakrishna net Worth and Total assets jewellery worth as per Election Commission Affidavit

ఇక 2022 నుంచి 2023 వరకు బాలయ్య ఆదాయం వివరాల్లోకి వెళితే.. ఆయన సంపాదన 10 కోట్ల రూపాయలు. ఇంకా హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బీఏ పూర్తి చేసినట్టు డాక్యుమెంట్స్‌లో వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆస్తుల వెల్లడి వివరాలు మీడియాలోను, సోషల్ మీడియాలోను ట్రెండింగ్‌గా మారాయి.

బాలకృష్ణ నటించిన సినిమాల వివరాల్లోకి వెళితే.. ఆయన ఇటీవల కాలంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో నటించారు. ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొన్నాయి. ప్రస్తుతం తన కెరీర్‌లో 109వ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X