Don't Miss!
- Finance Banking News: ముసలోళ్లనూ వదలని మోదీ సర్కార్..! SBI తాజా రిపోర్ట్ వివరాలివే..
- Sports RCB vs SRH: పక్కనపెట్టలేదు.. నేనే ఆడనని చెప్పా: గ్లేన్ మ్యాక్స్వెల్
- News AP Election Survey: వైసీపీ వర్సెస్ కూటమి పోరులో మొగ్గు వారికే -తేల్చేసిన మరో జాతీయ సర్వే..!
- Technology ఏప్రిల్ 23 న షియోమీ లాంచ్ ఈవెంట్! 4 కొత్త పరికరాలు లాంచ్ కాబోతున్నాయి!
- Automobiles చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
ఖరీదైన ఇల్లు కొన్న బాలకృష్ణ.. దాని విలువ ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఒక ఖరిదైన ఇల్లును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ధిక విషయాల్లో ఎంతో ఆలోచించి అడుగులు వేసే బాలయ్య ఆస్తి విలువపై సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. ఇక చాలా రోజుల తరువాత ఆయన కొత్త ఇంటిపై కథనాలు వెలువడుతున్నాయి.
చేతిలో చేయేసి చెప్పు బావ అంటున్న దీపికా పదుకోన్.. రణ్వీర్తో కలిసి ముంబై వీధుల్లో...
లాక్ డౌన్ లో ఎన్నో సహాయాలు
ఓ వైవు స్టార్ హీరోగా మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండే బాలకృష్ణ సామజిక సేవా వంటి కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ లో కూడా చాలా మంది పేద వారికి తనవంతు సహయాన్ని అందించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి కూడా సహాయం చేశారు.
రెండు అంతస్థుల కొత్త ఇల్లు
ఇక చాలా రోజుల తరువాత బాలకృష్ణ ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఒక కాస్ట్లీ ఏరియాలో రెండు అంతస్థులు ఉన్న ఇంటిని ఆయన పేరుపై ఇటీవల రిజిస్ట్రేషన్ అయినట్లు సమాచారం. మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. చాలా ఖరీదైన ఈ ఇంటి కోసం బాలకృష్ణ గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నారట.
ఖరీదు ఎంతంటే..
ఇక ఇల్లు ఖరీదు 15కోట్ల రూపాయలనీ తెలుస్తోంది. అంటే దాదాపు బాలకృష్ణ రెండు సినిమాల రెమ్యునరేషన్స్ తో సమానమట. ఇక ఇల్లు 9,395 చ. అ విస్తీర్ణంలో ఉందట. రిజిస్ట్రేషన్ ఫీ కింద 7.5లక్షలు చెల్లించిన బాలకృష్ణ 82.5లక్షలను స్టాంప్ డ్యూటీ కింద చెల్లించారని తెలుస్తోంది.
బోయపాటి దర్శకత్వంలో..
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక సినిమా టైటిల్ పై త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కూడా కనిపించనున్నాడు.