బాలయ్య లుక్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. రూలర్ కొత్త పోస్టర్ వైరల్

నందమూరి బాలకృష్ణ.. తన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండితెరపై నటసింహంలా దూసుకుపోతూ.. మాటల తూటాలతో శత్రువుల గుండెలను పేల్చుతూ ఉంటే ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే. బాలయ్య అంటూ ముద్దుగా పిలుచుకునే అభిమానులు.. ఆయన డైలాగ్స్ కోసం మళ్లీ మళ్లీ సినిమాలను చూస్తుంటారు. అలాంటి బాలయ్య మరోసారి విజృంభించేందుకు వచ్చేస్తున్నాడు. చివరగా కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో కనిపించినా.. అవి బాలయ్య ఇమేజ్‌కు భిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే తన అభిమాన ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు వచ్చేస్తున్నాడు.

నిరాశపర్చిన బయోపిక్..

నిరాశపర్చిన బయోపిక్..

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ చిత్రాలు అనుకున్నంతగా ఆడకపోయేసరికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఎంతో అట్టహాసంగా తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రాలను నిర్మించాడు.

 రాజకీయాలతో బిజీ బిజీ..

రాజకీయాలతో బిజీ బిజీ..

ఇక ఈ రెండు చిత్రాలు చేదు అనుభవాన్ని మిగల్చడంతో రాజకీయంగా బిజీ అయ్యారు. ఎన్నికలు సమీపించడంతో ఆ హడావిడిలోనే ఉండిపోయాడు. అయితే అక్కడ కూడా ఆయనకు మిశ్రమ ఫలితమే ఎదురైంది. హిందుపురంలో బాలక‌ృష్ణ గెలిచినా.. టీడీపీ ఘోర పరాజయాన్ని చూసింది. దీంతో మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్దమయ్యారు.

బోయపాటితో సినిమా అంటూ..

బోయపాటితో సినిమా అంటూ..

ఎన్నికల్లో ఓడిపోవడంతో.. సినిమాలతో బిజీ కావాలని బాలయ్య ఆలోచించాడు. దీంతో బోయపాటి సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడని, ఇక సినిమా ప్రారంభం కావడమే తరువాయి అన్నట్లు రూమర్స్ హల్‌చల్ చేశాయి. బడ్జెట్ కారణంగా ఈ మూవీ క్యాన్సల్ అయిందని, అయితే త్వరలోనే వీరి కాంబినేషన్‌లో ఓ అదిరిపోయే సినిమా రాబోతోందని సమాచారం.

కేఎస్ రవికుమార్‌తో రూలర్

కేఎస్ రవికుమార్‌తో రూలర్

జై సింహా సినిమాతో బాలయ్యకు హిట్ ఇచ్చిన దర్శకుడు కేఎస్ రవికుమార్. ఆయన మీదున్న నమ్మకంతో బాలయ్య మరో అవకాశాన్ని ఇచ్చాడు. ఈసారి రూలర్ అంటూ మరో పవర్‌ఫుల్ పాత్రలో చూపించనున్నట్లు తెలుస్తోంది. దసరాకు రిలీజ్ చేసిన పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

టీజర్‌తో దుమ్ములేపనున్న రూలర్..

టీజర్‌తో దుమ్ములేపనున్న రూలర్..

తాజాగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మోస్ట్ రొమాంటిక్ లుక్‌లో ఉన్న బాలయ్య పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అసలు అతను బాలయ్యేనా? అని షాక్ అయ్యేట్టున్న ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించి టీజర్ త్వరలోనే రానుందని తెలిపారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X