బాలకృష్ణ ఎప్పుడూ గొడవ పడుతుంటారు.. ఆయనతో అటాచ్‌మెంట్! డైరెక్టర్ రవిబాబు కామెంట్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విలక్షణ దర్శకుడు రవిబాబు. ఆయనతో తనకున్న అనుబంధం తాలూకు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే బాలకృష్ణతో తానూ సినిమా తీస్తానని, దాని పేరు కూడా ఇదే అంటూ ఆసక్తికరంగా మాట్లాడాడు రవిబాబు. వివరాల్లోకి పోతే..

జాలీగా ఆయనతో..

జాలీగా ఆయనతో..

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో జాలీగా ప్రోగ్రామ్‌లో పాల్గొని తన మనసులోని మాటలను ప్రేక్షకుల ముందుంచాడు రవిబాబు. ఈ సందర్భంగా ఆలీ.. రవిబాబును కొన్ని ప్రశ్నలు వేయడం, అందులో భాగంగా బాలకృష్ణ టాపిక్ రావడంజరిగింది. దీంతో బాలకృష్ణతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు డైరెక్టర్ రవిబాబు.

బాలయ్య బాబు ఎప్పుడూ గొడవే..

బాలయ్య బాబు ఎప్పుడూ గొడవే..

తనతో బాలయ్య బాబు ఎప్పుడూ గొడవపడుతుంటారని ఈ సందర్భంగా రవిబాబు చెప్పాడు. నువ్వు అందరితో సినిమాలు తీస్తావు.. నాతో ఎందుకు తీయవంటూ వాదిస్తారని రవిబాబు అన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత తనకు ఫోన్ చేసి ఇలాగే అడిగాడని రవిబాబు చెప్పాడు. అయితే మీ సినిమాకు దర్శకత్వం వహించడం నాకు గౌరవం అని బాలకృష్ణతో చెప్పానని రవిబాబు తెలిపాడు.

అలాంటి వారు బాలయ్య..

అలాంటి వారు బాలయ్య..

నేను ఆ మాట చెప్పగానే.. బాలయ్య కూడా మీ దర్శకత్వంలో నటించడం నాకు గౌరవం అన్నారని చెప్పాడు రవిబాబు. ఆయనతో వ్యక్తిగతంగా తనకు మంచి అటాచ్‌మెంట్ ఉందని ఆయన తెలిపారు. ఒకవేళ బాలకృష్ణతో సినిమా చేస్తే అది ఎలాంటిదైనా.. దానికి టైటిల్ మాత్రం ‘ఐరన్ మ్యాన్' అని మాత్రమే పెడతానని చెప్పేశాడు రవిబాబు.

 ఐరన్ మ్యాన్ అంటూ హింట్

ఐరన్ మ్యాన్ అంటూ హింట్

ఈ లెక్కన్న రవిబాబు- బాలకృష్ణ కాంబోలో సినిమాకు తెరవెనుక రంగం సిద్దమవుతోందనే అర్థం చేసుకోవచ్చు. అందుకే ‘ఐరన్ మ్యాన్' అనే టైటిల్ కూడా రివీల్ చేస్తూ చిన్న హింట్ ఇచ్చాడు రవిబాబు. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఆ సంచలనాలు ఊహించడం కష్టమే మరి!.

అల్లరి నుంచి అదుగో వరకు

అల్లరి నుంచి అదుగో వరకు

వైరెటీ చిత్రాలకు పెట్టింది పేరు రవిబాబు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టాడు. తన స్టైల్ వేరుగా ఉంటుందని నిరూపించాడు రవిబాబు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా 'అల్లరి' నుంచి మొదలుకొని ''అనసూయ, నచ్చావులే, అమరావతి, అవును, అవును 2, అదుగో'' లాంటి సినిమాలు రూపొందించి తనకంటూ క్రేజ్ తెచ్చుకున్నాడు రవిబాబు.

అక్టోబర్ 18న ఆవిరి

అక్టోబర్ 18న ఆవిరి

ఇక రవిబాబు దర్శకత్వంలో రాబోతున్న తాజా సినిమా ‘ఆవిరి'. హారర్ నేపథ్యంలో వైరెటీ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అక్టోబర్ 18 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X