బాలకృష్ణకు రెండోసారి మొండిచేయి.. నిరాశలో నందమూరి అభిమానులు!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి అభ్యర్థులు మంత్రులుగా ప్రమాణం చేయడం ద్వారా కొత్త ప్రభుత్వాన్ని అధికారికంగా అమలులోనికి తెచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున గెలిచిన కీలక నేతలను మంత్రి పదవి వరించింది. అయితే ఇప్పటికే మూడుసార్లు ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి దక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. బాలయ్యకు పదవి దక్కకపోవడం గురించిన వివరాల్లోకి వెళితే..

నందమూరి వంశంలో ఏకైక రాజకీయ వారసుడిగా బాలకృష్ణ పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్బావం నుంచి ప్రచారంలో ఎప్పుడూ ముందున్నాడు. పార్టీని ముందుకు నడిపించడంలో తనదైన శైలిలో సేవలు అందించారు. అటు రాజకీయాల్లోను, ఇటు సినిమా రంగంలోను ఎదురులేని విధంగా తన సత్తాను చాటుతున్నారు.

Nandamuri Balakrishna Not Included in Andhra Ministry Fans gets disappointed

ఇక స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి మాత్రం జగన్ ప్రభంజనాన్ని జయించి ఎమ్మెల్యేగా గెలిచి తన పవరేంటో చూపించారు. అదే విధంగా మూడోసారి బంపర్ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు.

ఇక హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలయ్యకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి మంత్రిగా వస్తారని అభిమానులు ఆశించారు. కానీ చివరకు రెండోసారి కూడా మొండిచేయి చూపించారు అనే వాదన వినిపిస్తున్నది. బాలయ్యకు పదవి దక్కకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

Nandamuri Balakrishna Not Included in Andhra Ministry Fans gets disappointed

ఇక తొలిసారి గెలిచిన పవన్ కల్యాణ్, నారా లోకేష్ మంత్రి పదవిని దక్కించుకొన్నారు. గత మూడు పర్యాయాలుగా గెలిచిన బాలయ్యకు మంత్రి పదవిని చేపట్టేందుకు అర్హత లేదా? అని ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసారి కేంద్ర ప్రభుత్వంలో పురందేశ్వరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X