JR NTR ఫ్లెక్సీలు తొలగించండి..బాలకృష్ణ వార్నింగ్..ఎన్టీఆర్ వర్ధంతి రోజున నందమూరి ఫ్యామిలీలో విభేదాలు!

ఎన్టీఆర్ వర్ధంతి రోజున నందమూరి కుటుంబంలోని విభేధాలు బయటపడ్డాయి. పెద్ద ఎన్టీరామారావు చనిపోయి 27 సంవత్సరాలు అవుతున్నాయి. ఈరోజున జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం జరిగిందని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫ్లేక్సీలను బాలయ్య తొలగించమనడం వల్ల.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

నేడు ఎన్టీ రామారావు వర్ధంతి. ఈరోజున నందమూరి ఫ్యామిలీలోని విభేధాలు బయటపడ్డాయి. జనవరి 18న.. నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. అయితే ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లతో వారి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ అభిమానంతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం కామన్.

Recommended Video

Jr NTR Vs Nandamuri Balakrishna తప్పెవరిది? What Happened at NTR Ghat..? | Telugu Filmibeat

Nandamuri Balakrishna ordered to remove junior NTR flexies at NTR Ghat on NTR death Anniversary Full Details Here

ఇక ఎన్టీఆర్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా.. అక్కడికి వచ్చిన నందమూరి బాలకృష్ణ వాటిని చూసి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. తండ్రికి నివాళులు అర్పించిన బాలయ్య.. వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో బాలకృష్ణ ఆదేశంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లతో ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లను వెంటేనే తొలగించారు.

బాలయ్య ఆదేశాలతో అక్కడ ఉన్న బాలయ్య ఫ్యాన్స్.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఫ్లెక్సీలను తీసేశారు. ఘాట్ ఆవరణ నుంచి వాడిని తీసుకుపోయి.. రోడ్డుపై పడేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలయ్య ఆదేశంతో రెచ్చిపోయిన బాలయ్య ఫ్యాన్స్... ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డారని తెలుస్తోంది. బాలకృష్ణ అలా చెప్పడంతో ఇప్పుడు నెట్టింట ఈ న్యూస్ వైరల్ గా మారింది. బాలయ్య.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మా హీరో బ్యానర్లు ఎందుకు తొలగించాలంటూ మండిపడుతున్నారు. ఇక బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ వర్ధంతి రోజున వీరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు.. ఆస్కార్ నటుడిగా గుర్తింపు పొందారు.. అయితే ఆయనకు నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంత మంది ఫ్యాన్స్ బాలయ్య తీరు సరికాదని అంటున్నారు. నందమూరి కుటుంబం.. జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు దూరం చేసుకుంటుందని నిలదీస్తున్నారు. కేవలం చంద్రబాబుకు మద్దతు ఇవ్వనంత మాత్రాన.. రాజకీయంగా మద్దతు ప్రకటించనంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా అవమానించాలా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ మీద దృష్టి పెట్టి.. రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు.

బాలయ్య ఇలా వ్యవహరించటం.. అది కూడా కుటుంబానికి సంబంధించిన విషయంలో ఇలా ప్రవర్తించడం తప్పని కామెంట్స్ చేస్తున్నారు. పెద్దాయన తాత ఎన్టీఆర్ కు నివాళులర్పించే సమయంలో ఓ కొడుకుగా, బాబాయ్ గా బాలయ్య ఇలా వ్యవహరించటం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X