హాట్ బ్యూటీకి బాలకృష్ణ ఫోన్.. ఆయనే స్వయంగా రంగంలోకి దిగడంతో ఒప్పుకోక తప్పలేదట.!

By Manoj Kumar P

పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్రాళ్లకు గట్టి పోటీని ఇస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం.. కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం.. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపించడం వంటి వాటిలో ఆయన ముందున్నారు. అందుకే చాలా కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ నందమూరి హీరో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య.. టాలీవుడ్‌లోని ఓ హాట్ బ్యూటీకి స్వయంగా ఫోన్ చేశారట. ఇంతకీ ఆయన ఎందుకు కాల్ చేశారు.? ఆ వివరాలేంటో చూద్దాం.!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు

నందమూరి బాలకృష్ణకు పోయిన సంవత్సరం అస్సలు కలిసి రాలేదు. దీనికి కారణం 2019లో ఆయన నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. వీటిలో తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ‘యన్.టి.ఆర్' మూవీకి ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. దీంతో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు.

గట్టిగా కొట్టాలని ఆయనతో మరోసారి కలిశారు

గట్టిగా కొట్టాలని ఆయనతో మరోసారి కలిశారు

వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో మరోసారి కలిశారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఎన్నో ఆటంకాలు.. బాలయ్య లుక్.. కథ ఇదే

ఎన్నో ఆటంకాలు.. బాలయ్య లుక్.. కథ ఇదే

ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వరుసగా దీనికి ఆటంకాలు రావడంతో ఆలస్యంగా పట్టాలెక్కింది. ఇందులో బాలయ్య అఘోరా కనిపించబోతున్నారని ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అందుకోసమే ఆయన సన్నబడ్డారని అంటున్నారు. అలాగే, ఈ సినిమా కథ మొత్తం నవగ్రహాలు అనే అంశం చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

కొత్త విషయాలు వెలుగులోకి.. అంచనాలు పైపైకి

కొత్త విషయాలు వెలుగులోకి.. అంచనాలు పైపైకి

సూపర్ హిట్ కాంబో కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ గురించి, కథ గురించి, ఆర్టిస్టుల గురించి సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హాట్ టాపిక్ అయిపోతోంది. అదే సమయంలో ఈ హిట్ కాంబోపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

పేర్లు బయటకు వచ్చినా ఆ విషయంలో రాని స్పష్టత

పేర్లు బయటకు వచ్చినా ఆ విషయంలో రాని స్పష్టత

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టుల గురించి వివరాలు బయటకు రావడం లేదు. కానీ, నటీమణుల్లో పలానా వారిని ఫైనల్ చేశారని మాత్రం తరచూ ఓ వార్త ప్రచారం అవుతోంది. ఈ క్రమంలోనే శ్రేయ, నయనతార, అంజలి, కేథరిన్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా ఎవరినీ ఫిక్స్ చేయలేదనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Mahesh Babu's Next Movie Would Be Among These Directors
హాట్ బ్యూటీకి బాలకృష్ణ ఫోన్.. వెంటనే ఓకే

హాట్ బ్యూటీకి బాలకృష్ణ ఫోన్.. వెంటనే ఓకే

కరోనా ప్రభావంతో ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ గ్యాప్‌లోనే హీరోయిన్‌ను ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారాని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. స్వయంగా ఆయనే మాట్లాడడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X