విజయ్ మాల్యాకు బాలకృష్ణకు ఏంటి సంబంధం.. నందమూరి హీరో ఆయనలా అయిపోతున్నాడా.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు జూనియర్లకు పోటీగా తయారవుతున్నారు. కేవలం లుక్కుల విషయంలోనే కాదు.. ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. వీరిలో నందమూరి బాలకృష్ణ పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈయన తన సినిమాలకు ఏమాత్రం గ్యాప్ రాకుండా చూసుకుంటారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య బాగా సన్నబడిపోయిన బాలయ్య.. యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్యకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 బాలయ్య అస్సలు ఆగడం లేదు

బాలయ్య అస్సలు ఆగడం లేదు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్' అనే సినిమా చేస్తున్నాడు. సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ‘జై సింహా' వంటి హిట్ సినిమా తర్వాత వస్తున్న ‘రూలర్'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పట్టాలపై ఉండగానే బోయపాటి శ్రీనుతో సినిమాకు ఓకే చెప్పేశాడు ఈ నందమూరి హీరో.

వాటికి అదిరిపోయే రెస్పాన్స్

వాటికి అదిరిపోయే రెస్పాన్స్

‘రూలర్'కు సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన వీటికి యూట్యూబ్‌లో వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్‌లలో కనిపిస్తున్నాడు. అందులో ఒకటి పోలీస్ పాత్ర కాగా, మరొకటి బిజినెస్‌మ్యాన్. ఈ పాత్రలో ఆయన ఎంతో స్లిమ్‌గా దర్శనమిస్తున్నాడు.

ఆ సినిమా చాలా స్పెషల్

ఆ సినిమా చాలా స్పెషల్

‘రూలర్' తర్వాత బాలయ్య.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి. ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్‌ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఆది నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది కూడా హిట్ అయితే.. వీళ్ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ అవుతుంది.

ఒక్కటి కాదు రెండు కాదు

ఒక్కటి కాదు రెండు కాదు

బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కలయికలో సినిమా అని ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అలాగే, రోజా, అనసూయ, రష్మీ గౌతమ్ సహా జబర్ధస్త్ షోలోని పలువురు ఆర్టిస్టులు నటిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కూడా ఇద్దరు

ఇందులో కూడా ఇద్దరు

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ డుయల్ రోల్ చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలన్న పట్టుదలతో ఉన్న బోయపాటి.. ఇందుకోసం అదిరిపోయే కథను రెడీ చేశాడని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' సినిమాల్లోనూ బాలయ్య డుయల్ రోల్ చేశాడు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
విజయ్ మాల్యాతో ముడిపెడుతున్నారు

విజయ్ మాల్యాతో ముడిపెడుతున్నారు

బాలయ్య కొత్త సినిమా గురించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారట. అందులో ఒక పాత్ర ఊరును శాసించే పెద్దగా ఉంటుందట. అలాగే, మరో పాత్ర మాత్రం కార్పొరేట్ దిగ్గజం విజయ్ మాల్యాను గుర్తు చేసేదిగా డిజైన్ చేశారని అంటున్నారు. ఆయనలా ప్లేబాయ్‌గానూ కనిపిస్తాడట. అలాగే, ఇందులో బాలయ్య గెటప్ కూడా ఆయనలానే ఉంటుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X