AP Swearing Ceremony: ప్రమాణ స్వీకారంలో అరుదైన ఘట్టం.. చిరంజీవి, బాలయ్య RRR రేంజ్‌లో!
గత ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి.. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయకేతనం ఎగుర వేసింది. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరుతుందో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేటితో ఆ క్రతువు ముగిసింది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో పరిపాలనను మొదలు పెట్టేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన జరిగింది. అదేంటో మీరే చూడండి!
ఎవరూ ఊహించని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నేడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు విజయవాడ సమీపంలోని కేసరిపల్లి దగ్గర జరిగిన ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించగా.. అది ఎంతో గ్రాండ్‌గా జరిగింది. దీనికి ప్రధాని మోదీతో పాటు ఎంతో మంది నాయకులు, ప్రముఖులు హాజరై దీన్ని సక్సెస్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ అక్కడకు వచ్చిన ప్రముఖులు, పార్టీల కార్యకర్తలు ఆనందంతో కేకలు వేశారు. అంతేకాదు, తమ సంతోషాన్ని తెలుపుతూ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత కూడా పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. ఆ సమయంలోనూ అదే రీతిలో స్పందనను తెలియజేశారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా మెగా, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చూసేందుకు మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లంతా హాజరయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీదకు వచ్చారు. అప్పుడు ఆయనకు నందమూరి బాలకృష్ణ ఎదురుగా వెళ్లి ఆప్యాయంగా స్వాగతం పలికారు.
నందమూరి బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఉన్న దృశ్యాన్ని చూసిన వాళ్లంతా సంతోషంగా కేకలు వేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో బాలయ్య, చిరంజీవి చేతులు కలుపుకున్న వీడియోను షేర్ చేస్తూ RRR సినిమా రేంజ్‌లో మీమ్స్ క్రియేట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











