Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలయ్య బాబు రెడీ.. ఇక దబిడి దిబిడే!!
నందమూరి నటసింహం బాలకృష్ణ అంతా సెట్ చేసుకున్నారు. తన తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా చాలా రోజుల క్రిందటే పూజా కార్యక్రమాలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ కాస్త ఆలస్యం చేసిన బోయపాటి.. ఈ మార్చి నుంచి బాలయ్య బాబుతో కలిసి రంగంలోకి దిగుతున్నారు.
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారని తాజా సమాచారం.
వైవిధ్యభరితమైన కథ సిద్ధం చేసిన బోయపాటి ఇకపై ఆ కథకు తెర రూపం ఇస్తూ స్పీడు పెంచనున్నారట. మరోవైపు బాలకృష్ణ కూడా త్వర త్వరగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లెక్కన చూస్తే ఇక మార్చి నుంచి దబిడి దిబిడే!! అని చెప్పుకోవచ్చు.
గ్రహాలు, అవి చూపే ప్రభావం ఈ కథలో ప్రధాన అంశమని తెలుస్తోంది. చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించనున్నారని, అఘోరాగా ఆకట్టుకోనున్నారని వార్తలు చేస్తూనే ఉన్నాం. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రీయ, అంజలి లలో ఓ హీరోయిన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట బోయపాటి. మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. అతిత్వరలో హీరోయిన్స్ విషయమై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం.