twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య బాబు రెడీ.. ఇక దబిడి దిబిడే!!

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ అంతా సెట్ చేసుకున్నారు. తన తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా చాలా రోజుల క్రిందటే పూజా కార్యక్రమాలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ షూటింగ్ కాస్త ఆలస్యం చేసిన బోయపాటి.. ఈ మార్చి నుంచి బాలయ్య బాబుతో కలిసి రంగంలోకి దిగుతున్నారు.

    బాలకృష్ణ- బోయపాటి కాంబోలో భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారని తాజా సమాచారం.

    Nandamuri Balakrishna Ready: Boyapati Srinu plan

    వైవిధ్యభరితమైన కథ సిద్ధం చేసిన బోయపాటి ఇకపై ఆ కథకు తెర రూపం ఇస్తూ స్పీడు పెంచనున్నారట. మరోవైపు బాలకృష్ణ కూడా త్వర త్వరగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లెక్కన చూస్తే ఇక మార్చి నుంచి దబిడి దిబిడే!! అని చెప్పుకోవచ్చు.

    గ్రహాలు, అవి చూపే ప్రభావం ఈ కథలో ప్రధాన అంశమని తెలుస్తోంది. చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించనున్నారని, అఘోరాగా ఆకట్టుకోనున్నారని వార్తలు చేస్తూనే ఉన్నాం. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రీయ, అంజలి లలో ఓ హీరోయిన్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట బోయపాటి. మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. అతిత్వరలో హీరోయిన్స్ విషయమై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం.

    English summary
    Nandamuri Balakrishna commits with Boyapati srinu. As per latest talk this movie will come to sets on March 2nd. In this movie Anjali selected as heroine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X