Love Reddy మూవీకి నందమూరి బాలకృష్ణ అండ.. అలాంటి సాయంతో చిన్న నిర్మాతకు చేయూత

నట సింహ నందమూరి బాలకృష్ణ నిర్మాతలకు అండగా ఉంటారనేది ఇండస్ట్రీలో అందరూ చెప్పుకొంటారు. అంతేకాకుండా చిన్న నిర్మాతలను ఎప్పుడూ ప్రోత్సాహిస్తూ ఉండటం బాలకృష్ణ నైజం అనేది సినీ వర్గాల అభిప్రాయం. గతంలో కూడా బాలకృష్ణ ఎన్నో చిన్న సినిమాలకు అండగా నిలిచి పోత్సాహించారు. తాజాగా మరో చిన్న సినిమాకు అండగా నిలిచి టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మూవీ విజయవంతం కావాలని కోరుకొన్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతన్స్ ప్రొడక్షన్స్, శహరి స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోజరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Nandamuri Balakrishna released Love Reddy Title Poster

తాజాగా లవ్ రెడ్డి చిత్ర టైటిల్ పోస్టర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... యంగ్ టీమ్ అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషన్ తెలిపారు.

కర్ణాటకలోని బాగేపల్లి ప్రాంతంలో, బెంగళూరులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. త్వరలో ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నారు.

నటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి
నిర్మాతలు: హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప
సంగీతం: ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
సహా నిర్మాతలు: నవీన్ రెడ్డి, సుమలత రెడ్డి, సుస్మిత రెడ్డి, హరీష్.ఏ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X