బాలయ్య రూలర్ అప్‌డేట్.. ఇక రచ్చ చేసేందుకు రెడీ
నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పే డైలాగ్‌లు విని అభిమానులకు చాలా కాలమే అయింది. చివరగా వచ్చిన రెండు సినిమాలు బాలకృష్ణ స్టైల్ మూవీస్ కాకపోవడంతో.. బాలయ్య డైలాగ్‌లు, ఫైటింగ్‌లు ఫ్యాన్స్ మిస్ అయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్ అయిన కథానాయకుడు, మహానాయకుడు నిరాశ పరిచిన బాలకృష్ణ.. రూలర్ చిత్రంతో ఆ లోటును పూడ్చాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పటికే పోస్టర్స్‌తో దుమ్ములేపుతున్న బాలకృష్ణ.. రూలర్‌పై అంచనాలు పెంచేశాడు. జై సింహా అంటూ బాలయ్యను వెండితెరపై విజృంభించేలా చేసిన కె ఎస్ రవికుమార్ మళ్లీ అదే రేంజ్‌లో చూపించబోతోన్నట్లు తెలుస్తోంది. దసరా,దీపావళి కానుకగా విడుదల చేసిన పోస్టర్స్‌తో మాస్‌కు ఫీస్ట్‌లా అనిపించిన ఈ చిత్రం.. ఆ తరువాత రిలీజ్ చేసిన రొమాంటిక్ లుక్‌తో మరింత హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక మిగతా కార్యక్రమాలన్నీ త్వరలోనే పూర్తి చేసుకుని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్లు తెలిపారు. ప్రకాష్ రాజ్, భూమిక, వేదిక, సోనాల్ చౌహాన్ లాంటి తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రాన్ని సీ కళ్యాణ్ నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించాలని చిత్రయూనిట్ ప్రయత్నిస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











