ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తున్న బాలయ్య... కొట్టుడే కొట్టుడు!
బాలయ్య బాబు ఒక్కొక్కడికి చుక్కులు చూపిస్తున్నారు. వీర కొట్టుడు కొడుతున్నాడు. అయితే ఇదంతా సినిమా షూటింగులోనే. బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం 105వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైసింహా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది.
బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ గురువారం(సెప్టెంబర్ 5) నుండి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో బాలయ్య లుక్ విభిన్నంగా ఉండబోతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనాల్ చౌహాన్‌తో పాటు వేదిక మరో హీరోయిన్స్‌గా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్, నిర్మాత: సి.కల్యాణ్, కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు, కథ: పరుచూరి మురళి, మ్యూజిక్: చిరంతన్ భట్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఆర్ట్: చిన్నా,
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరవి, కొరియోగ్రఫీ: జానీ మాస్టర్


Click it and Unblock the Notifications











