‘అఖండ’తో బాలకృష్ణ అరుదైన రికార్డు: కెరీర్‌లోనే తొలిసారి అంత మొత్తానికి పూర్తైన డీల్

చాలా కాలంగా విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే సక్సెస్ కోసం ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు. ఫలితంగా ఆయన అభిమానలు తీవ్ర నిరాశతో ఉండిపోయారు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాలో నటిస్తున్నారు.

'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ భాగం మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవాలో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయబోన్నారు.

Nandamuri Balakrishnas Akhanda East Godavari Rights Sold with Solid Price

నటసింహా నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ పలు టీజర్లు విడుదల అయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా టైటిల్ రోర్ వీడియోకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ వీడియో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

'అఖండ' ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన వివరాలు తరచూ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ రైట్స్‌ను ప్రముఖ సంస్థలు దక్కించుకున్నట్లు తెలిసింది. ఇక, తాజాగా బాలయ్య నటిస్తోన్న ఈ చిత్రం ఈస్ట్ గోదావరి హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకోసం ఏకంగా రూ. 5 కోట్లకు డీల్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం బాలయ్య కెరీర్‌లోనే రికార్డు రేటు అనే టాక్ వినిపిస్తోంది. అంటే 'అఖండ' మూవీపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు.. చాలా ప్రాంతాల్లో ఇది రికార్డు బిజినెస్ చేసుకుందని సమాచారం.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X