NBK109 వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్.. కేక పెట్టించిన బాలయ్య కొత్త మూవీ పోస్టర్.. త్రివిక్రమ్ చేతుల మీదుగా!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో బిజీగా మారిపోయారు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలే కాకుండా ఇతర వ్యాపార, స్వచ్చంద సేవా కార్యక్రమాలతో బిజీ కనిపిస్తారు. జూన్ 10వ తేదీన నందమూరి బాలకృష్ణ జన్మదినం కావడంతో ఆయన కొత్త సినిమాను అంటే NBK109 పూజా కార్యక్రమాలు నిర్వహించారు. NBK109 సినిమా ప్రారంభోత్స వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నది. నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు.

 NBK109

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో NBK107 స్క్రిప్ట్‌ను దర్శకుడు వీవీ వినాయక్ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి అందజేశారు. దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. విజయవంతమైన దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేశారు. మొదటి షాట్ కి మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

 NBK109

NBK109 మూవీ కథ ఎలా ఉండబోతుందో అనే విధంగా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందోననే విషయాన్ని తెలియజేశారు. కాన్సెప్ట్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది. వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అనే ట్యాగ్ లైన్ కేక పెట్టించింది. కాన్సెప్ట్ పోస్టర్‌పై ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు అని ముద్రించిన క్యాప్షన్ మరింత ఆకట్టుకొనేలా ఉంది.

 NBK109

NBK109 సినిమాను 2024 ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
దర్శకుడు: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X