సెన్సార్ పూర్తిచేసుకున్న బాలకృష్ణ 'రూలర్'.. బోర్డు సభ్యుల రియాక్షన్ ఎలా ఉందంటే!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా సినిమా 'రూలర్'. ఆయన కెరీర్‌లో 105వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జై సింహా' హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఈ చిత్ర టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో 'రూలర్'పై హైప్ క్రియేట్ అయింది.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా రూలర్ చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. పైగా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, పలు సామాజిక అంశాలు కూడా ప్రస్తావించడం బాగుందని సెన్సార్ సభ్యులు రూలర్ చిత్రయూనిట్‌తో చెప్పారని సమాచారం.

ఏదిఏమైనా బాలకృష్ణ మరోసారి ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడని ఇప్పటిదాకా విడుదలైన రూలర్ అప్‌డేట్స్ తెలిపాయి. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించగా.. సీనియర్ హీరోయిన్ భూమిక ముఖ్యపాత్రలో నటించింది.
ఇక రూలర్ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో నటించారని టాక్. మొత్తానికి బాలయ్య 'రూలర్' మూవీ పేరుకు యాక్షన్ చిత్రమే అయినా.. అన్ని అంశాలను జోడించి తెరకెక్కించినట్టు సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాపై నందమూరి అభిమానులు పెట్టుకున్న ఆశలు ఏ మేర తీరుతాయనేది!.


Click it and Unblock the Notifications











