బాలకృష్ణ 'రూలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్.. నిర్మాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే!
నందమూరి బాలకృష్ణ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'రూలర్'. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ హంగులతో సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిశాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలిసింది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్ల మేర జరిగిందని రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఈ నెంబర్స్ పట్ల చిత్రనిర్మాత చాలా సంతృప్తిగా ఉన్నారని సమాచారం.

ఏరియా వైజ్ చూస్తే..
నైజాంలో 5 కోట్లు, సీడెడ్‌లో 5.50 కోట్లు, నెల్లూరు 1.28 కోట్లు, గుంటూరు 2.70 కోట్లు, కృష్ణా 1.60 కోట్లు, వెస్ట్ గోదావరి 1.45 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.60 కోట్లు, ఉత్తరాంధ్ర 2. 50 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్ల బిజినెస్ జరిగి వరల్డ్ వైడ్ మొత్తంగా 24.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రూలర్.

రూలర్ సెన్సార్ సర్టిఫికెట్
బాలయ్య బాబు కెరీర్ లో 105వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివితో విడుదల కాబోతోంది. తాజాగా సెన్సార్ సర్టిఫికెట్‌ని అభిమానులతో పంచుకుంది రూలర్ యూనిట్.

బాలయ్య హంగామా.. అడుగడుగో యాక్షన్ హీరో
ఇకపోతే రూలర్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ''అడుగడుగో యాక్షన్ హీరో'' నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. కింగ్ ఆఫ్ జంగిల్‌లా వచ్చాడంటూ బాలకృష్ణను ఆకాశానికెత్తుతూ ఈ సాంగ్ షూట్ చేశారు. ఇందులో లుక్స్ పరంగా బాలకృష్ణ అదరగొట్టేశారు.

ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు
''ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తేలిగ్గా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌తో రూలర్ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య రచ్చ చూసి ఈ సారి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు జనం. పైగా గతంలో కెఎస్ రవికుమార్- బాలకృష్ణ కాంబోలో వచ్చిన జై సింహా సూపర్ హిట్ కావడం కారణంగా 'రూలర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











