బాలకృష్ణ రూలర్ అప్‌డేట్.. ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'రూలర్'. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉంది.
గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైసింహా సూపర్ డూపర్ హిట్ కావడంతో 'రూలర్' సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. ఈ మేరకు డిసెంబర్ 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఫిక్స్ చేశారనేది ఇన్‌సైడ్ టాక్.

ఇప్పటికే రూలర్ సినిమా నుంచి విడుదలైన లుక్స్, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా ఈ చిత్రంలో బాలయ్యబాబు యంగ్ లుక్‌లో దర్శనమీయనుండటం నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అలాగే బాలయ్య బాబు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నారని మరో సమాచారం అందరిలో ఆత్రుత పెంచుతోంది. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.
బాలకృష్ణ 105వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచే పెద్ద ఎత్తున రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. టైటిల్ మొదలుకొని హీరోయిన్ల వరకూ రకరకాల వాదనలు వినిపించారు. చివరకు బాలకృష్ణ రెమ్మ్యూనరేషన్ విషయంలోనూ రూమర్స్ పుట్టించడంతో చివరకు నిర్మాత సి.కల్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











