విశాఖ తీరాన బాలయ్య సందడి.. రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా 'రూలర్'. ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు పోస్టర్స్, టీజర్, సాంగ్స్ రూపంలో నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా ఈవెంట్ జరగబోయే తేదీతో పాటు వేదికను కూడా ప్రకటించారు.

డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు విశాఖలోని వుడా పార్క్‌లోని ఎమ్జీఎమ్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా 'రూలర్' ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని తెలుపుతూ ఇందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. పోలీస్‌గా ఉన్న బాలయ్య... గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడన్నదే ఈ చిత్ర కథాంశం.
'రూలర్' నుంచి ఇప్పటికే విడుదలైన బాలయ్య గెటప్పులు, స్టిల్స్, పోస్టర్స్, టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన 'జైసింహా' సూపర్ హిట్ అయిన కారణంగా రూలర్ పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించించిన ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











