Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య ‘రూలర్’ అక్కడ సూపర్ హిట్.. రిజల్ట్ చూసి షాక్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్.!
గత ఏడాది కేవలం ఒకే ఒక్క సినిమాతో వచ్చినా సక్సెస్ అయ్యాడు నందమూరి బాలకృష్ణ. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జై సింహా' అనే సినిమా సంక్రాంతి బరిలో నిలిచి విజయాన్ని అందుకుంది. సీ కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. ఇక, ఈ సంవత్సరం మాత్రం బాలయ్యకు భారీ ఫ్లాప్ సినిమాలు నిరాశను మిగిల్చాయి. తన తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'యన్.టి.ఆర్' రెండు భాగాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన 'రూలర్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చర్చనీయాంశం అవుతోంది. వివరాల్లోకి వెళితే...
హిట్ ఇచ్చిన ఉత్సాహంతో కలిశారు
‘జై సింహా' వంటి హిట్ తర్వాత కేఎస్ రవికుమార్ - నందమూరి బాలకృష్ణ - సీ కల్యాణ్ మరోసారి కలిశారు. వీళ్ల కలయికలోనే ‘రూలర్' మూవీ తెరకెక్కింది. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటించగా.. భూమిక, ప్రకాశ్ రాజ్, జయసుధ, షియాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రూల్ చేస్తాడనుకుంటే ఇలా అయిందేంటి?
హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. మూడు సినిమాలతో పాటు గత శుక్రవారం విడుదలైన ‘రూలర్' మంచి టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దారుణంగా విఫలమైంది. దీంతో బాలయ్య ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వాటితో కలిపి పరాజయాల హ్యాట్రిక్ నమోదైంది.
వాటికి మాత్రం మంచి స్పందన
ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగులు, డ్యాన్సులకు మాత్రం మంచి స్పందన వస్తోంది. అలాగే, కార్పొరేట్ స్టైల్లో ఉన్న బాలయ్య గెటప్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే, పాత కథ, కథనానికి తోడు రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, బాలయ్య రెండో గెటప్‌ను ట్రోల్ చేస్తున్నారు.
అక్కడ మాత్రం సూపర్ హిట్
‘రూలర్' ఓవరాల్‌గా డిజాస్టర్‌గా నిలిచినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సినిమా ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్సైట్ బుక్ మై షోలో మంచి రేటింగ్ సంపాదించింది. మొదటి రోజు 90 శాతం ఓట్లను సంపాదించిన ఈ సినిమా.. ప్రస్తుతం 77 శాతం రేటింగుతో కొనసాగుతోంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.