ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉంటే.. బోనులో ఉండే సింహాంలా.. ఇక వేటే.. రూలర్ టీజర్ క్రేజీగా
నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. కొద్దిరోజులుగా స్పీడును తగ్గించారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అభిమానుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఆయన స్పీడు పెంచేశారు. ఇందులో భాగంగానే కొత్త సినిమా షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ టీజర్ ఎలా ఉందంటే..
పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ విశ్వరూపం చూపించారు. లాఠీతోనే కాకుండా డైలాగ్స్‌తో తుక్కు రేగకొట్టినట్టు టీజర్ చెప్పింది. ఒంటిమీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో ఉండే సింహాలా ఉంటాను. యూనిఫాం తీసానా బయటికి వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే అంటూ పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌ను కేకపెట్టించాయి. అలాగే సోనాల్ చౌహాన్‌తో రొమాన్స్ కూడా ఆకట్టుకొంటున్నది.

రెండో హిట్ కోసం కలిశారు
గతంలో ‘జై సింహా' వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘రూలర్' అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఒక్కటి కాదు.. రెండు షేడ్స్
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. గ్యాంగ్‌స్టర్ పాత్ర బాలయ్య లుక్స్ ఎక్ట్రార్డినరీగా ఉన్నాయనే చెప్పాలి. ఇక, ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు.

సరికొత్త లుక్‌లో బాలయ్య
ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్లకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే
బాలయ్య ఈ సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతున్నారు. తన అభిమానులకు ఎలాగైనా మంచి సినిమాను అందించాలన్న కసితో పని చేస్తున్న బాలయ్య.. అదే సమయంలో తనలో తాను కొంత మార్పులు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సన్నగా అవడం కోసం ఆయన రోజుకు ఐదు గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన లుక్‌లో వేరియేషన్ కనిపిస్తుంది.
Recommended Video
కండలు చూపిస్తాడట
‘రూలర్'లో ఓ సీన్ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. అది ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్టన్ సీన్ అని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీనికి కారణం ఈ సీన్‌లో బాలకృష్ణ షర్ట్ తీసేయబోతున్నాడట. తన ఛాతీని చూపించి మరీ విలన్లను ఇరగదీస్తాడట. ఇటీవల ఆయన దాదాపు పది కేజీల వరకు తగ్గిన విషయం తెలిసిందే. ఈ సీన్‌లో ఆయన కష్టానికి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











