For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి తుపాకీ పట్టిన బాలకృష్ణ.. ఆయుధం మార్చేసి సీరియస్ అయ్యాడుగా!

    |

    గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. అదే జోష్‌లో వెండితెర ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. తన తదుపరి సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో 105వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు 'రూలర్' టైటిల్ కన్ఫర్మ్ చేసింది చిత్రయూనిట్.

    ఈ మేరకు ఇటీవలే 'రూలర్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్‌లో ఖాకీ డ్రెస్ ధరించి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన బాలయ్యబాబు చేతిలో సుత్తి పట్టుకున్నారు. బాలయ్య అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చిన ఈ లుక్ సోషల్ మీడియా లోనూ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో దానికి కొనసాగింపుగా కొద్దిసేపటి క్రితం 'రూలర్' సెకండ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

    Nandamuri Balakrishna Second Look From Ruler

    తాజాగా విడుదలైన ఈ సెకండ్ లుక్ లోనూ పోలీస్ ఆఫీసర్ గానే కనిపించిన బాలయ్య బాబు.. ఈ సారి మాత్రం చేతిలో ఆయుధం మార్చేశారు. తుపాకీ పట్టుకొని ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్‌గా కనిపించారు. దీంతో రూలర్ సినిమాలో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని కన్ఫర్మ్ అయింది. ఈ రెండు లుక్స్‌తో పాటు గతంలో వచ్చిన కొన్ని లుక్స్ నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి.

    కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రూలర్ సినిమాలో బాలకృష్ణ బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైసింహా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Nandamuri Balakrishna commits with director K. S. Ravikumar for his new movie. As per latest news this film is starts on August 9th. And in this movie Blakrishna played a intresting role. Now this movie second look released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X