ఆ సినిమా వస్తే లేచి వెళ్లిపోతా .. రాజమౌళికి షాకిచ్చిన బాలయ్య
తెలుగువారి ఆరాధ్య దైవం, నటరత్న నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరపై అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని నేడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక , సోషియో ఫాంటసీ, ఫిక్షన్ సినిమాల్లో నటించిన అరుదైన నటుడిగా బాలయ్య ఘనత వహించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో దాదాపు 50 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అతికొద్ది మంది నటుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు.
సినిమాలతో పాటు నాన్నగారి బాటలోనే రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన తల్లి పేరిట నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్‌తో వరుసగా నాలుగో హిట్ అందుకుని ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించారు బాలయ్య. దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లతో బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తోంది ఈ చిత్రం.

ఇక ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో హోస్ట్‌గానూ సక్సెస్ కొట్టారు బాలకృష్ణ. ఆహాను రేసులో నిలబెట్టి.. ఇండియా వైడ్‌గా క్రేజ్ తీసుకొచ్చిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఈ ఒక్క కార్యక్రమంతో ఆహా సబ్‌స్క్రైబర్లు, వ్యూయర్‌షిప్ భారీగా పెరిగింది. అలాగే ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో, రీజినల్ లాంగ్వేజ్ కేటగిరీలో నెంబర్ వన్‌గా నిలిచింది అన్‌స్టాపబుల్. హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది.
కాగా.. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించిన కళాఖండం అవతార్. విజువల్ ఎఫెక్ట్స్‌తో మాయ చేసిన కామెరూన్ బాక్సాఫీస్ వద్ద డాలర్ల వర్షం కురిపించాడు. పండోరా గ్రహం మీద మనిషికి, అక్కడి మనిషులకు మధ్య జరిగిన పోరాటాన్ని చూపించాడు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన అవతార్ 2 సైతం అదే స్థాయిలో కుమ్మిపడేసింది. కొత్తగా డైరెక్షన్‌లోకి వచ్చే వాళ్లకి ఆ సినిమా ఓ లైబ్రరీ లాంటిదని విశ్లేషకులు అంటూ ఉంటారు. అలాంటి అవతార్ సినిమా తనకు నచ్చదని తేల్చేశాడు బాలయ్య. అది కూడా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముందు.

అన్‌స్టాపబుల్ షోకు ఓ రోజున రాజమౌళి గెస్ట్‌గా రాగా.. బాలయ్య ఇంగ్లీష్ సినిమాలు, హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ల గురించి చెబుతూ అవతార్ నాకు నచ్చలేదని చెబుతాడు. ఆ మాటలకు షాకైన రాజమౌళి అమ్మో అంటాడు. 12 ఏళ్ల టైం తీసుకుని జేమ్స్ కెమెరూన్ అవతార్‌ను తీశాడని.. అలాంటి సినిమా వస్తే నేను లేచి వెళ్లిపోతానని బాలకృష్ణ తెలిపారు. అవతార్ ఖచ్చితంగా గొప్ప సినిమాయే కానీ, అది మీ సినిమా లాగా ఆబాల గోపాలానికి అర్ధమవ్వాలని అన్నారు బాలయ్య. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











