MAA Elections : వారిని టార్గెట్ చేసిన బాలకృష్ణ.. రాసుకు పూసుకు తిరుగుతున్నారంటూ!

టాలీవుడ్ కి సంబంధించిన నటీనటులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కలకలం రేపుతున్నాయి. నిజానికి ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ పదవీకాలం సెప్టెంబర్ దాకా ఉన్నా సరే ప్రకాష్ రాజ్ లేఖతో ఈ మా ఎన్నికల కలకలం రేగింది.

Recommended Video

Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
 ఐదుగురు బరిలో

ఐదుగురు బరిలో

ప్రస్తుతానికి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు దిగుతున్నట్లుగా ప్రకటనలు వచ్చాయి. ముందుగా ప్రకాష్ రాజ్ తన అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న ప్రకటించగా ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన హేమ తాను కూడా అధ్యక్ష బరిలో దిగుతున్న అని ప్రకటించారు. వీరి తరువాత cvl నరసింహ రావు అనే నటుడు కూడా తెలంగాణ వాదంతో తెర మీదకు వచ్చారు. అయితే నటుడు విష్ణు కూడా తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు

 వెనక్కి తగ్గిన విష్ణు

వెనక్కి తగ్గిన విష్ణు

అయితే ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ఎన్నికలు ఎప్పుడు అని రెచ్చగొడుతూ ఎన్నికలు ఎప్పుడు అని ప్రశ్నిస్తుంటే మంచు విష్ణు మాత్రం తాజాగా విడుదల చేసిన ఒక వీడియో ఆసక్తికరంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏకైక లక్ష్యం ఒక బిల్డింగ్ ఏర్పరచుకోవడం అని చెబుతూ తన కుటుంబమే గతంలో పాతిక శాతం వాటా వేసుకుని బిల్డింగ్ కి సహకరిస్తామని చెప్పామని ఇప్పుడు అది కూడా అవసరం లేదని మొత్తం బిల్డింగ్ అయ్యే ప్రతి రూపాయి తమ కుటుంబం నుంచే వేసుకుని బిల్డింగ్ కట్టిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే తాను మా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనని ఈ సారి ఏకగ్రీవం చేసుకుందామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

రాసుకుపూసుకు

రాసుకుపూసుకు

ఇది ఈ విషయం మీద తాజాగా నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతూ ఉన్నారంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మా బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా అని ప్రశ్నించిన ఆయన బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకు వస్తే నేను భాగస్వామిని అవుతాను అని చెప్పుకొచ్చారు.

లోకల్ నాన్ లోకల్

లోకల్ నాన్ లోకల్

అందరం కలిస్తే ఇంద్రభవనం లాంటి భవనాన్ని నిర్మించవచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇది గ్లామర్ ఇండస్ట్రీలో అని పేర్కొన్న ఆయన మన సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనే వ్యవహారాన్ని తాను పట్టించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ హీరోలే టార్గెటా?

ఆ హీరోలే టార్గెటా?

అయినా అసలు మా బిల్డింగ్ ఇప్పటివరకు ఎందుకు కట్ట లేక పోయారనేదే ప్రధాన ప్రశ్న అని అన్నారు. ఇప్పుడు దాకా బిల్డింగ్ నిర్మాణం కోసం ఫండ్స్ రైజ్ చేస్తామని ఫస్ట్ క్లాసులో అమెరికాకు తిరిగారని ఆ వచ్చిన డబ్బంతా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అయితే, ఎవరిని టార్గెట్ చేస్తూ బాలయ్య ఈ కామెంట్స్ చేశారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X