Veera Simha Reddy హెలికాప్టర్‌లో బాలయ్య, శృతిహాసన్, ఒంగోలులో నందమూరి ఫ్యాన్స్‌కు హైఫీవర్!
నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా మైత్రీ మూవీస్ బ్యానర్‌పై మలినేని గోపిచంద్ దర్శకత్వంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి ప్రకాశ్ నిర్మించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్‌కు ముస్తాబువుతున్నది. ఈ క్రమంలో ఏపీలోని ఒంగోలు పట్టణంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 6వ తేదీన అట్టహాసంగా నిర్మించేందుకు రెడీ అయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాల్లోకి వెళితే..
తొలుత మైత్రీ మూవీ మేకర్స్ తమ ప్రణాళికలో భాగంగా వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‌లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అనుమతులు నిరాకరించారు. దాంతో ఏబీఎం గ్రౌండ్‌లో పనులు నిలిపివేసి.. రాత్రికి రాత్రే మరో ప్రదేశంలో వేదికను ఖరారు చేశారు. ప్రస్తుతం ఒంగోలు బైపాస్ రోడ్డులోని అర్జున్ ఇన్‌ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను బ్రహ్మండంగా నిర్మించారు.

అర్జున్ ఇన్‌ఫ్రా మైదానంలో బాలకృష్ణ పాత సినిమాల్లోని పాత్రల కటౌట్లను భారీగా ఏర్పాటు చేశారు. నర్సింహానాయుడు, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర చిత్రాల్లోనే గెటప్స్‌ను భారీగా ఏర్పాటు చేశారు. ఇక శుక్రవారం నాలుగు గంటల సమయంలో ఒంగోలుకు బాలకృష్ణ ప్రయాణం అయ్యారు.
నటసింహం బాలకృష్ణ ఒంగోలు చేరుకొనేందుకు మైత్రీ మూవీస్ ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెలికాఫ్టర్‌లో బాలయ్య, శృతిహాసన్, నిర్మాత నవీన్, చిత్ర యూనిట్ సభ్యులు ఒంగోలు బయలుదేరి వెళ్లారు.

ఇదిలా ఉండగా, వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఫంక్షన్‌కు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











