Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి సంబరాల్లో బాలయ్య విన్యాసాలు.. మోక్షజ్ఞ ఇంకా అదే లుక్ లో.. ఫొటో వైరల్
నందమూరి ఫ్యామిలీలో హీరోగా పరిచయం కావాల్సిన మోస్ట్ క్రేజీ యంగ్ బాయ్ మోక్షజ్ఞ. ఈ యువ కెరటాన్ని వెండితెరపై చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బాలకృష్ణ మాత్రం ఇంకా తన వారసుడి విషయంలో మొదటి అడుగు కూడా వేయలేనట్లు తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ ఫొటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల అనంతరం మోక్షజ్ఞకు సంబంధించిన మరో లుక్ వైరల్ గా మారింది.

నందమూరి వారసులు
నందమూరి వంశంలో ఇప్పటికే బాలయ్య అనంతరం కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నారు. అయితే వారి తరువాత చాలామంది యువకులు ఉన్నప్పటికీ అందరూ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక తారకరత్న ప్రయత్నాలు బాగానే చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాడు.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం..
ఇక ప్రస్తుతం అందరి చూపు నందమూరి బాలకృష్ణ వరసుడిపైనే ఉంది. ఆయన ఏకైక కుమారుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతను ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు. అభిమానులు కూడా చాలా సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ విషయాన్ని బాలయ్యతో చర్చించగా ఆయన పాజిటివ్ గానే స్పందించారు.

పాతికేళ్ల లోపే వెండితెరపై
గతంలోనే మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోక్షజ్ఞ ఫిట్నెస్ గా లేకపోవడంతో అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా సిద్ధం కాలేదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. నందమూరి కుటుంబంలో చాలామంది పాతికేళ్ల లోపే వెండితెరపై కనిపించారు. కానీ మోక్షజ్ఞ మాత్రం ఆ వయసు దాటినా కూడా ఇంకా సినిమాల వైవు ఆసక్తి ఉన్నట్లుగా కూడా తెలియడం లేదు.

సంక్రాంతి సంబరాల్లో..
ఇక ప్రతీ సారి ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లో నందమూరి మోక్షజ్ఞ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సెలబ్రేషన్స్ లో కూడా తండ్రితో కలిసి గుర్రపు స్వారీ కూడా చేసినట్లు అర్ధమవుతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో ప్రకాశం జిల్లా కారంచేడులోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో పండుగ జరుపుకున్నారు.

బాలకృష్ణ విన్యాసాలు
ఈ వేడుకలో నందమూరి వసుంధర మరియు వారి కుమారుడు మోక్షజ్ఞ ఇతర కుటుంబ సభ్యులను కూడా మనం చూడవచ్చు. స్థానిక జాతరలో బాలకృష్ణ, మోక్షజ్ఞ గుర్రపు స్వారీ తో అలరించారు. బాలకృష్ణ విన్యాసాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకకు లోకేశ్వరి, ఉమామహేశ్వరి కూడా హాజరయ్యారు.

హీరోగా ఎప్పుడు కనిపిస్తాడో?
ఇక మోక్షజ్ఞను చూస్తుంటే ఇంకా అతను హీరో అవ్వడానికి ఏ మాత్రం సిద్ధం కాలేదని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే నార్మల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక బాలయ్య అప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 తన దర్శకత్వంలోనే ఉంటుందని కూడా చెప్పారు. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.