Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Mokshagna Teja: కొడుకుకు కేక్ తినిపించిన బాలయ్య.. మరో లుక్ లో నందమూరి వారసుడు.. ఫొటో వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఇతర సినీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అసలే ఇటీవల కాలంలో బాలయ్య బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ మునుపటి కంటే ఎక్కువగా పెరుగుతొంది. అయితే మోక్షజ్ఞ కూడా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని అనుకుంటున్న అభిమానులకు కొంత నిరాశ ఎదురవుతోంది. ఇక లేటెస్ట్ గా బాలయ్య మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వివరాల్లోకి వెళితే..
నందమూరి హీరోలు
నందమూరి కుటుంబంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో పాటు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వచ్చిన తారకరత్న ప్రయత్నాలు బాగానే చేసినప్పటికీ కూడా అతనికి అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందరికంటే ఎక్కువ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ కు చేరిపోయాడు.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం
నందమూరి బాలకృష్ణ ఏకైక వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై గత మూడు నాలుగు ఏళ్ళుగా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. అసలైతే పాతికేళ్ల వయసులోనే అతను వెండితెరకు ఎంట్రీ ఇవ్వాలి అని అభిమానులు చాలా కోరుకున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా కొడుకు ఎంట్రీ కోసం చాలా కథలు విన్నాడు కానీ.. ఏది అంతగా నచ్చలేదు.
ఎన్నో కథలు
గతంలో అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. బాలయ్య కూడా మంచి కథ ఉంటే చూడమని కూడా చెప్పాడు.
ఇక బోయపాటి కథ సిద్ధం చేసినప్పటికీ ఆ తర్వాత బాలయ్య అది కూడా నమ్మకంగా అనిపించక మళ్లీ రిజెక్ట్ చేసినట్లు టాక్ వచ్చింది. అలాగే మధ్యలో అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది. ఇక ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తాడు అని బాలయ్య డైరెక్ట్ చేస్తాడు అని కూడా అన్నారు.
మోక్షజ్ఞకు ఇష్టం ఉందా?
అయితే ఎన్ని కథలు విన్నా కూడా బాలయ్య బాబు మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు అనే టాక్ కూడా వచ్చింది. ఇదంతా ఒక తరహాలో ఉంటే మోక్షజ్ఞ ఫిట్నెస్ విషయంలో కూడా ఇంకా పెద్దగా దృష్టి పెట్టలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మోక్షజ్ఞ అసలు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తాడా? ఇవ్వడా? అసలు అతనికి ఇష్టం ఉందా లేదా అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ అయితే వినిపించాయి. కానీ బాలయ్య బాబు మాత్రం తప్పకుండా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడాని అన్నారు.
లేటెస్ట్ ఫొటో వైరల్
ఇక ఆ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా బాలయ్య సినిమా షూటింగ్ లోనే తన కొడుకు పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేశాడు. అందులో ప్రత్యేకంగా కొడుకుకు కేక్ తినిపిస్తున్న స్టిల్ కూడా వైరల్ గా మారింది. మోక్షజ్ఞ లుక్ కూడా మరింతగా మారినట్లు అనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ గా మారుతోంది. అభిమానులు పుట్టినరోజు సందర్భంగా విశేస్ అందిస్తూ మొదటి సినిమాను తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.