బాలయ్యతో నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటో లీక్.. వారసుడు ఇంకా సిద్ధమవ్వలేదా?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల వారసుల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నందమూరి వంశంలో బాలకృష్ణ తనయుడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. గత మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కూడా చాలా ఇంటర్వ్యూలలో తప్పకుండా తనయుడు ఎంట్రీ ఉంటుంది అని తెలియజేశారు. అప్పుడప్పుడు మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇంకా సినిమాల్లోకి రాకముందు నుంచే అతనికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక రీసెంట్ గా అఖండ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లిన మోక్షజ్ఞ అక్కడ తండ్రి ఒక ఫోటో కూడా దిగడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

గెస్ట్ రోల్స్ అనుకున్నారు.. కానీ
నందమూరి వంశంలో దాదాపు అందరు హీరోలు కూడా రెండు పదుల వయసులో కి రాకముందే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది బాల్యంలోనే వెండితెరపై కనిపించారు. ఇక మోక్షజ్ఞ విషయంలో మాత్రం నందమూరి బాలకృష్ణ చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు. అంచనాలు తీవ్రస్థాయిలో పెరగడంతో మంచి కంటెంట్ ఉన్న కథ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మధ్యలో అతన్ని బాలయ్య తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయించాలని అనుకున్నారు కానీ ఆ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు.

భారీ ఫ్యాన్ ఫాలోవర్స్
నందమూరి బాలకృష్ణ ఏలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని చాలాసార్లు రుజువైంది. మాస్ ఆడియన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఇక ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా అలాంటి మాస్ సినిమాలతో ఆకట్టుకుంటే మాత్రం ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలుస్తాడాని చెప్పవచ్చు. అయితే మొదటి సినిమా చాలా ప్రత్యేకం కాబట్టే బాలయ్య కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వస్తోంది.

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ.. ఫిక్స్
బాలకృష్ణ గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన కొడుకు ఎంట్రీ తప్పకుండా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అంతకంటే ముందు మోక్షజ్ఞ సినిమాలపై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని కామెంట్స్ వచ్చాయి అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ టాలీవుడ్ ఎంట్రీలో ఎలాంటి అనుమానం లేదని బాలయ్య తేల్చి చెప్పారు.

అఖండ స్పాట్ లో మోక్షజ్ఞ
ఈ రోజుల్లో చాలావరకు యువ హీరోలు వ్వీలైనంత వరకు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మినిమం జిమ్ బాడీ ఉండాలి అని ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే మోక్షాన్ని మాత్రం ఇంకా ఆ వాతావరణానికి అలవాటు పడలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల మోక్షజ్ఞని అఖండ షూటింగ్ స్పాట్ కు వెళ్లి అక్కడ తండ్రితో పోటో కూడా దిగాడు. వారితో పాటు బాలయ్య బార్య కూడా ఫ్రేమ్ లోకి వచ్చారు.
Recommended Video

ఇంకా సిద్ధం అవ్వలేదా?
అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కీలకమైన షెడ్యూల్ లో బాలయ్య బిజీగా ఉండగా మోక్షజ్ఞ ప్రత్యేకంగా కలుసుకోవడానికి వచ్చాడు. అయితే వీరు దిగిన ఫోటోలలో మోక్షజ్ఞ ఇంకా బొద్దుగానే కనిపిస్తున్నాడు. అతను ఇంకా హీరోగా సిద్ధంగా లేడు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. బాలకృష్ణ అయితే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ఉంటుందని ఆ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కూడా అన్నారు. ఇక తన దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుందని చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications











