Mokshagna నందమూరి అభిమానులూ ఊపిరి పీల్చుకోండి... యంగ్ లయన్ దిగుతోంది!
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయసులోనూ ఇంకా బాక్సాఫీస్ రికార్డులను తరగరాస్తున్నారు. అయితే ఆయన పాటు హీరోలుగా రాణిస్తున్న చిరంజీవి, నాగార్జున కొడుకులు రామ్‌చరణ్, నాగచైతన్య ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. కానీ బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వలేదు.
ఆయన అరంగేట్రం గురించి గత నాలుగేళ్లుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. అదే సమయంలో ఆయన లుక్స్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మోక్షజ్ఞకు సంబంధించి మరో కొత్త లుక్ ఒకటి నెట్టింట్లో లీకై తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడంతా ఆ ఫొటోనే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే...
నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలని, స్టార్ హీరోగా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుని, వరుస విజయాలను అందుకోవాలని నందమూరి అభిమానులను ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. అయితే ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి రావడం, అంతలోనే అది వేర్వేరు కారణాల వల్ల కనుమరుగైపోవడం, అలా మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం కావడం జరుగుతూనే ఉంటోంది.
అప్పుడే రావాలి కానీ :
వాస్తవానికి ఆదిత్య 999తో మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారని గట్టిగా ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఎక్స్‌పెరిమెంట్‌ను పక్కనపెట్టి కమర్షియల్ ప్రాజెక్ట్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీని రెడీ చేయాలని చూస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ లాంఛ్ మూవీ కోసం బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి సహా పులువురు దర్శకుల పేర్లు బాగానే తెరపైకి వచ్చాయి. కానీ ఏదీ సెట్ కాలేదు.
స్లిమ్‌గా మారి ఆకట్టుకుంటూ :
అయితే ఈ మధ్య మోక్షజ్ఞ కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నారు. తన తండ్రి బాలయ్య మూవీ సెట్స్‌లో, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో సందడి చేస్తూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఆయన లుక్స్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యాయి. మొదట్లో ఆయన చాలా బొద్దుగా ఉండేవారు. దీంతో ఫ్యాన్స్ అంతా హీరో కటౌట్ లేదని నిరుత్సాహపడేవారు. కానీ మోక్షజ్ఞ కొంతకాలంగా ఫిట్‌నెస్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి స్లిమ్‌గా మారుతూ ఆకట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బరువు తగ్గుటూ ఫేస్‌లో ఫ్రెష్‌నెస్‌తో కనపడుతున్నారు.

యంగ్ లయన్ సిద్ధమవుతోంది :
అలా తాజాగా మరోసారి కనిపించారు మోక్షజ్ఞ. ఆయన లేటెస్ట్ పిక్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇందులో ఎంతో ఫ్రెష్‌గా స్టైలిష్‌గా కనిపించారు. టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించి సందడి చేశారు. దీంతో అభిమానుంతా యంగ్ లయన్ సిద్ధమవుతోంది అంటూ తెగ సంబరపడిపోతున్నారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై తెగ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందో లేదో..


Click it and Unblock the Notifications











