twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేదవారి వెన్నపూస.. తెలుగు జాతి వెన్నుపూస: ఎన్టీఆర్‌కు బాలయ్య ఘన నివాళి

    |

    శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. 'లవకుశ' తెలుగు-తమిళ వెర్షన్లు, 'సంపూర్ణ రామాయణం' తమిళ వెర్షన్, 'శ్రీకృష్ణ సత్య', 'శ్రీ రామాంజనేయ యుద్ధం', 'శ్రీరామ పట్టాభిషేకం'... ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, 'అడవి రాముడు', 'చరణదాసి', 'చిట్టి చెల్లెలు', 'తిక్క శంకరయ్య' మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.

    తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆద్యుడిగా పేరొందిన నందమూరి తారక రామారావు జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని సినీ ప్రముఖులంతా ఆయనను స్మరించుకుంటున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది స్టార్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కుమారుడు, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ వీడియోను పోస్ట్ చేస్తానని ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఆయన తండ్రిని స్మరించుకుంటూ శ్రీరామ దండకాన్ని ఆలపించారు. దానికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేశారు.

    ఈ వీడియో ఆరంభంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. 'విశ్వ తెలుగు జనవాళికి మీ బాలకృష్ణ నమ: సుమాజలి. వెండితెర మీదున్న కథానాయకుడిని ఆ బాల గోపాలానికి ఆరాధ్యుడిని చేసిన ఆది అదినాయకుడు, తన పేరులో ఉన్న తారాస్థాయిని జీవిత సహచారిగా నడిపించిన తారక రాముడు, తెలుగు ఉనికిని నేల నలుచరులా నినదించిందిన జగదబిరాముడు, తెలుగు జెండాను ప్రతి గుండెలా ఎగురవేసిన కోదండరాముడు, పేదవారి వెన్నపూస, తెలుగు జాతి వెన్నుపూస మా నాన్న గారు.. మీ అందరి అన్నగారు జన్మించి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ తారక రాముడికి అంకితం ఈ శ్రీరామ దండకం' అంటూ మొదలు పెట్టాడు.

    Nandamuri Balakrishna Sri Rama Dandakam Video Released

    నందమూరి తారక రామారావుకు సంబంధించిన పలు గెటప్‌లను చూపిస్తూ.. తయారు చేసిన ఈ వీడియోలో బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని అద్భుతంగా ఆలపించారు. గొంతు ఎలా ఉన్నా.. ఆయన పాడిన విధానానికి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల ఊపిరి తీసుకోకుండా పాడడం నిజంగా అభినందించదగ్గ విషయమే. అందుకే ఈ శ్లోకం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక, ఈ పాటకు వినోద్ యాజమన్యా సంగీతం అందించగా.. కొమ్మినేని వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. తుమ్మల ప్రసన్న కుమార్, ప్రణవానంద్, రాంబాబు మేడికొండ సహకారం అందించారు.

    English summary
    Nandamuri Balakrishna sings the holy chant Sri Rama Dandakam on the eve of NTR's birth anniversary. This Video Now Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X