Daaku Maharaaj Teaser Review: డాకు మహారాజ్‌గా బాలయ్య..గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుని చూశారా?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్‌బీకే 109 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? టైటిల్ ఏంటీ? అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ చిత్ర యూనిట్ శుక్రవారం టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేసింది. ఇదెలా ఉందో చూస్తే :

సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్యను గతంలో ఎన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారట బాబీ. భగవంత్ కేసరి విజయంతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన బాలయ్య మంచి ఊపులో ఉన్నారు. ఇలాంటి దశలో వస్తున్న ఎన్‌బీకే 109పై చిత్ర సీమలో భారీ అంచనాలున్నాయి.

Nandamuri Balakrishna starring NBK 109 Daaku Maharaaj Teaser Review

ఎన్‌బీకే 109 మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. డాకు మహారాజ్, వీరమాస్, సర్కార్ సీతారాం వంటివి వీటిలో కొన్ని. ఈ నేపథ్యంలో ఈరోజు సినిమా టైటిల్ , రిలీజ్ పైనా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీకి డాకు మహారాజ్ అనే టైటిల్‌ను ఖరారు చేసిన చిత్ర యూనిట్.. సంక్రాంతి కానుకగా ఎన్‌బీకే 109ను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని టీజర్‌లో అనౌన్స్ చేసి సస్పెన్స్‌కు తెరదించారు.

డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణ సరసన సైంధవ్ ఫ్రేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ మరో హీరోయిన్‌గా కనిపించనున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇక టీజర్‌ విషయానికి వస్తే.. ప్రారంభంలో గుర్రానికి ఓ మనిషిని కట్టి ఏడారిలో ఈడ్చుకుంటూ వెళ్తారు. ఓ మ్యాప్‌లో కొందరు దారిని వెతుకుతుండగా.. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడి కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది.

ఇంతలో బాలయ్య హిందీలో నేనేవరో తెలుసా? డాకు.. డాకు మహారాజ్ అంటాడు. టైటిల్‌కు తగ్గట్లుగా థమన్ బీజీఎం అదిరిపోయింది. ముసుగు ధరించి గుర్రంపై వస్తున్న బాలయ్య లుక్ డిఫరెంట్‌గా ఉంది. లాంగ్ హెయిర్, మీస కట్టుతో గతంలో ఎన్నడూ కనిపించని లుక్‌లో బాలకృష్ణ అంచనాలు పెంచేస్తున్నారు. చూడబోతే ఈ సంక్రాంతికి అభిమానులకు బాలయ్య మాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీలాగా కనిపిస్తోంది. మరి డాకు మహారాజ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X