Akhanda కోసం బాలయ్య రెండు పనులు: హైలైట్ కాబోతున్న దాన్ని మొదలెట్టాడట
తన వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత హిట్‌ను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు నటసింహా. ఇందుకోసం తనకు బాగా కలిసొచ్చిన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడోసారి జత కట్టారాయన.
గతంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో నందమూరి బాలకృష్ణకు 'సింహా'తో భారీ హిట్‌ను అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత దానికి మించేలా వీళ్లిద్దరూ 'లెజెండ్' వంటి సక్సెస్‌ను అందుకున్నారు. ఇలా రెండు సూపర్ హిట్ల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ భాగం మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించి యాక్షన్ ఎపిసోడ్‌ను సైతం పూర్తి చేసేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియో 'అఖండ' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చివరి షెడ్యూల్‌లో భాగంగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. తాజాగా 'అఖండ' మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయట. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులు తమ పాత్రలకు డబ్బింగ్ కూడా మొదలెట్టారని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా 'అఖండ' మూవీకి డబ్బింగ్ ప్రారంభించారట. ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారని తెలిసింది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ఆయన ఏకకాలంలో రెండు పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక, ఈ చిత్రంలో బాలయ్య నోటి నుంచి పవర్‌ఫుల్ డైలాగులు పేలబోతున్నాయి. ఇవే ఇందులో హైలైట్ అవుతాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వాటికి సంబంధించిన డబ్బింగ్ పనిలోనే బాలయ్య బిజీగా ఉన్నారని టాక్.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అఖండ' మూవీలో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











