రూట్ మార్చాలని బోయపాటికి సలహా.. హ్యాట్రిక్ కొట్టేందుకు అదిరిపోయే స్క్రిప్ట్..

నందమూరి నటసింహం బాలకృష్ణ.. వెండితెరపై డైలాగ్స్ చెబితే విజిల్స్‌తో మోత మోగాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ నటించినా.. అవి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కు, ఫ్యాన్స్‌కు ఊపిచ్చేవి కావు. జై సింహా అంటూ వచ్చి శత్రువులను ఊచకోత కోశాడు. మళ్లీ ఆ చిత్రం తరువాత రూలర్ అంటూ వెండితెరపై రక్తాన్ని ప్రవహింపజేసేందుకు సిద్దమవుతున్నాడు.

ట్రెండ్ మార్చాలని ప్రయత్నాలు..

ట్రెండ్ మార్చాలని ప్రయత్నాలు..

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఒన్లీ యాక్షన్, అభిమానులకే పరిమితం అనేలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చాలని చూస్తున్నారని టాక్. ఇకపై చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్' చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 హ్యాట్రిక్ కొట్టాలనే..

హ్యాట్రిక్ కొట్టాలనే..

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒకరకమైన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరూ మరోసారి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

బాలయ్యకు సూచనలు..

బాలయ్యకు సూచనలు..

అయితే యాక్షన్ పాళ్లు హద్దులు దాటకుండా చూడమని బోయపాటికి బాలకృష్ణ సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేలా కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూడమని అన్నారట. ఆ సూచనలను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన 'రూలర్' చిత్రం, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

Recommended Video

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
రూలర్‌తో ప్రయోగం..

రూలర్‌తో ప్రయోగం..

కొత్తదనం ప్రయత్నించడంలో భాగంగానే బాలయ్య తను లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. బాలయ్య గెటప్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గోల్ఫ్ షాట్ కొడుతున్న పోస్టర్‌ను విడుదల చేయగా అది కూడా వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, భూమిక, సోనాల్ చౌహాన్, వేదికలాంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X