Just In
- 5 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 6 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 6 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 7 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- News
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ... ప్రధాని మోడికి 600 మంది మేధావుల లేఖ
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Finance
పెరిగిన టారిఫ్‌లు.. మరి ఇప్పుడైనా టెలికాం షేర్లు కొనవచ్చా?
- Lifestyle
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రూట్ మార్చాలని బోయపాటికి సలహా.. హ్యాట్రిక్ కొట్టేందుకు అదిరిపోయే స్క్రిప్ట్..
నందమూరి నటసింహం బాలకృష్ణ.. వెండితెరపై డైలాగ్స్ చెబితే విజిల్స్‌తో మోత మోగాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ నటించినా.. అవి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కు, ఫ్యాన్స్‌కు ఊపిచ్చేవి కావు. జై సింహా అంటూ వచ్చి శత్రువులను ఊచకోత కోశాడు. మళ్లీ ఆ చిత్రం తరువాత రూలర్ అంటూ వెండితెరపై రక్తాన్ని ప్రవహింపజేసేందుకు సిద్దమవుతున్నాడు.

ట్రెండ్ మార్చాలని ప్రయత్నాలు..
నందమూరి బాలకృష్ణ సినిమాలంటే ఒన్లీ యాక్షన్, అభిమానులకే పరిమితం అనేలా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చాలని చూస్తున్నారని టాక్. ఇకపై చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్' చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

హ్యాట్రిక్ కొట్టాలనే..
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఒకరకమైన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరూ మరోసారి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

బాలయ్యకు సూచనలు..
అయితే యాక్షన్ పాళ్లు హద్దులు దాటకుండా చూడమని బోయపాటికి బాలకృష్ణ సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేలా కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూడమని అన్నారట. ఆ సూచనలను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇక కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన 'రూలర్' చిత్రం, త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

రూలర్‌తో ప్రయోగం..
కొత్తదనం ప్రయత్నించడంలో భాగంగానే బాలయ్య తను లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. బాలయ్య గెటప్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గోల్ఫ్ షాట్ కొడుతున్న పోస్టర్‌ను విడుదల చేయగా అది కూడా వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, భూమిక, సోనాల్ చౌహాన్, వేదికలాంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.