బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు పండగే.. 25 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్టు సినిమా రీరిలీజ్.. ఎప్పుడంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 62 ఏళ్ల వయసులోనూ అధ్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అందరి చేత ఆహా అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాల్లో నటిస్తూ... అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. ఒకప్పుడు అంటే సినీ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎలాంటి చిత్రాలు చేశాడో ఇప్పుడు కూడా అలాంటి సినిమాల్లోనే నటిస్తూ.. విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటున్నాడు.

అయితే దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ సూపర్ డూపర్ హిట్టు సినిమాను ఇప్పుడు మరోసిరి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సినిమా ఏంటి, ఎప్పుడు విడుదల కాబోతుంది వంటి వివరాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nandamuri Balakrishna Super Duper Hit Film Samarasimha Reddy Going to Release Check Details

1999లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్టు సినిమా సమరసింహా రెడ్డి గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. బాలకృష్ణ సరసన సిమ్రాన్ నటించగా.. జయ ప్రకాశ్ రెడ్డి, పృథ్వీరాజ్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, దేవరాజ్, సుమిత్ర వంటి స్టార్ నటీనటీలు ఈ సినిమాలో నటించి యాక్టింగ్ ఇరగదీశారు. శ్రీసత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట రావు నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.

సినిమాలో బాలకృష్ణ చేసిన యాక్టింగ్, ఫైట్ లు అయితే మరింత అద్భుతమనే చెప్పాలి. ఇక పాటలు అయితే ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్స్ గా నిలిచాయి. అందాల ఆడబొమ్మ, చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, అడ్డీస్ అబ్బబ్బా అల్లం మురబ్బా, రావయ్యా ముద్దుల మావా, నందమూరి, లేడీ లేడీ... వంటి స్పెషల్ సాంగ్స్ ఇప్పటికీ అందరికీ ఇష్టమే. ఇలా అన్ని అద్భుతంగా ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Nandamuri Balakrishna Super Duper Hit Film Samarasimha Reddy Going to Release Check Details

అయితే ఈ చిత్రాన్ని ఇన్నాళ్లకు రీరిలీజ్ చేయబోతున్నారు. మార్చి 2వ తేదీన నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డి చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను ఇష్టపడే వాళ్లు, బాలయ్య బాబు ఫ్యాన్స్ కచ్చితంగా ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X