మా ఎన్నికల్లో బాలకృష్ణ సపోర్ట్.. మళ్ళీ మెగాస్టార్ కు ప్రత్యర్థిగానే అతనికి మద్దతు!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన MAA మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమరం మొదలయ్యింది. మొదట ఐదు మంది ప్రముఖ సెలబ్రెటీ లో మా అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే చివరికి ఆ సంఖ్య రెండుకు చేరింది. ఒకరి తర్వాత మరొకరు అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుని ప్రముఖ తారలకు సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు.
ఎప్పటిలానే ఈ సారి మాలో రాజకీయ ఎత్తుగడలు చాలానే నడుస్తున్నాయి. వెయ్యి మందికి వరకు ఉన్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఈ సారి చాలా ఆసక్తికరంగా మారింది. ఇక నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల విషయంలో తన మద్దతుపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

బాలకృష్ణ సపోర్ట్ ఎవరికి?
బాలకృష్ణ మా ఎన్నికల విషయంలో కొన్నిసార్లు సైలెంట్ గానే ఉన్నారు. అప్పుడప్పుడు తన వివరణ ఇచ్చినప్పటికీ కూడా మళ్లీ దాన్ని ఎక్కువగా కంటిన్యూ అయితే చేయలేదు. వీలైనంత వరకు బాలకృష్ణ ఎన్నికలకు ప్రతిసారి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే ఆయన మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సారి బాలకృష్ణ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

పొలిటికల్ గా..
మా అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ అలాగే మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ పోటీ పై టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా తన అభిప్రాయాలను వినిపిస్తున్నారు. ఇక మరోవైపు మంచు ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయాల్లో కూడా చాలాసార్లు స్పందిస్తూ వస్తోంది.

బాలయ్యను కలిసి విష్ణు
ఇక మంచు మోహన్ బాబు తన కొడుకుని గెలిపించాలని ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ ద్వారా మద్దతు అయితే అందుకున్నాడు. అలాగే మరికొంత మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా మంచు విష్ణు పక్కన ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సారి బాలకృష్ణ మద్దతు కూడా లభిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా అఖండ షూటింగ్లో బిజీగా ఉన్నా బాలకృష్ణ మంచు విష్ణు ప్రత్యేకంగా కలుసుకున్నారు.

బాల అన్నకు ధన్యవాదాలు
ఈ MAA ఎన్నికలలో నన్ను ఆశీర్వదించి మద్దతు ఇచ్చిన ఏకైక నటసింహం, బాల అన్నకు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు లభించడం నా గౌరవం.. అంటూ మంచు విష్ణు చాలా పాజిటివ్ గా స్పందించారు. ఇక బాలకృష్ణ తో మాట్లాడుతున్న రెండు ఫొటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Recommended Video

మెగాస్టార్ కు ప్రత్యర్ధిగానే..
అయితే బాలకృష్ణ మంచు విష్ణుకు సపోర్టు ఇవ్వడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ మెగాస్టార్ కు ప్రత్యర్థిగానే వెళుతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ ఇప్పుడు ప్రకాష్ రాజు కు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మంచు విష్ణుకు సపోర్టు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మరి బాలకృష్ణ సపోర్ట్ ఎంతవరకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











