IPL 2023: క్రికెట్ లో బాలకృష్ణ సందడి.. IPLలో దబిడి దిబిడే.. అందులో నటిసింహం రికార్డ్
నట సార్వభౌమ, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికెళ్లిన.. విదేశాల్లో చూసిన బాలయ్య బాబు క్రేజ్ మాములుగా ఉండదు. జై బాలయ్య అనే నినాదంతో మారు మోగాల్సిందే. సినిమాలే కాకుండా బాలయ్య బాబు ట్రెండ్ కు తగినట్లుగా నడుచుకుంటాడు. ఇప్పటికే టాక్ షోలతో అదరగొట్టిన బాలయ్య బాబు తాజాగా క్రికెట్ లో సందడి చేయనున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస పెట్టి..
సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. మొదట్లో బాల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బాలయ్య బాబు పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన కూడా తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాలకృష్ణకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో మంచి హిట్ కొట్టిన బాలయ్య బాబు ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

సెన్సేషన్ క్రియేట్..
ప్రస్తుతం కామెడీ చిత్రాలకు పేరొందిన అనిల్ రావిపూడితో ఒక సినిమాను లైన్ లో పెట్టాడు నట సింహం బాలయ్య బాబు. అలాగే తనకు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇలా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోయే బాలకృష్ణ ట్రెండ్ కి తగినట్లుగా నడుచుకుంటారు. అందులో భాగంగానే అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా మారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. తెలుగు టాక్ షోలలో అన్నిటింకంటే క్రేజ్ వచ్చేలా హోస్ట్ గా తన మార్క్ చూపించాడు.

ఐదు రోజుల్లో ప్రారంభం..
ప్రస్తుతం టాక్ షోలు, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎంటర్టైన్ మెంట్ గా ఫీల్ అయ్యే క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇండియాలో క్రికెట్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ 16వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. దీంట్లో బాలయ్య సందడి చేయనున్నాడు.

బ్యాట్ అందించి..
ఈ నెల 31వ తేది నుంచి ఐపీఎల్ 2023 16వ సీజన్ షురూ కానుంది. తొలి మ్యాచ్ గా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మాదబాద్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ కామేంటేటర్ గా వ్యవహరించనున్నారు. ఐపీఎల్ ప్రారంభోత్సవం రోజున స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ బాక్సుల్లో ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల రావుతో కలిసి బాలయ్య బాబు కూర్చోనున్నారు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు బాలయ్యతో డీల్ కుదుర్చుకుంది.

షూటింగ్ కు వెళ్లి..
ఈ విషయాన్ని తాజాగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విటర్ వేదికగా పంచుకుంది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకు వెళ్లి ఆయనతో వీడియో చేసినట్లుగా ఉంది. బాలకృష్ణను ఆహ్వానిస్తూ ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు ఆయనకు బ్యాట్ అందించారు.
సంతృప్తి ఇస్తుందని..
"ఐపీఎల్ 2023 కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో కలవడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రేక్షకులు నన్ను నటనలో కాదు ఆటలో కూడా చూడబోతున్నారు. నాకు ఈ ఆట అంటే మొదటి నుంచి, స్కూల్ డేస్ నుంచి ఇష్టం. మళ్లీ ఇప్పుడు ఈ ఆటకు నేను కామెంటేటర్ గా రావడం అన్నది నాకు ఆట ఆడుతున్నంత అనుభూతిని, సంతృప్తిని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను" అని బాలకృష్ణ అన్నారు. ఇలా క్రికెట్ కామెంటేటర్ గా బాలయ్య ఎంపిక అవ్వడం రికార్డుగా చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











