Balakrishna Unstoppable: బాలయ్య షోకు రాబోయే మొదటి గెస్ట్ ఎవరంటే.. డేట్స్ ఫిక్స్!

నేటి తరం స్టార్ హీరోలు కేవలం వేగంగా సినిమాలను పూర్తి చేయడమే కాకుండా మధ్యమధ్యలో కొన్ని కొత్త తరహా ప్రయోగాలతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై హోస్టింగ్ తో సరి కొత్తగా కనిపిస్తున్నారు. ఇక వైపు వెబ్ సీరీస్ లపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో నటీనటులు స్టార్ డమ్ ను లెక్క చేయకుండా మంచి కంటెంట్ దొరికోతే ఓటీటీ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

అయితే బాలకృష్ణ మాత్రం మొదటిసారి ప్రత్యేకంగా ఒక టాక్ షోకు హోస్టింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అన్‌స్టాపబుల్ షో ద్వారా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య ఇటీవల ఒక ఈవెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

స్టార్ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా

స్టార్ సెలబ్రిటీలతో ప్రత్యేకంగా

వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా ఎంతగానో గుర్తింపును అందుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఒక టాక్ షోలో స్టార్ సెలబ్రిటీలను ప్రత్యేకంగా ప్రశ్నించబోతున్నారు. ఈ షో కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆహా యాప్ లో ఇప్పటికే కొంత మంది సినీ తారలు ప్రత్యేకమైన షోలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్స్ ఎక్కువగా హోస్టింగ్ తో బిజీగా మారుతున్నారు.

ఆహా అన్‌స్టాపబుల్

ఆహా అన్‌స్టాపబుల్

ఇక నందమూరి బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేని విధంగా హోస్ట్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి అన్‌స్టాపబుల్ అనే ఆ షోపై అల్లు అరవింద్ ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్లాన్ చేసినట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ వర్మ షోకు సంబంధించిన ప్రత్యేకమైన యాడ్స్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. దర్శకుడు బీవీఎస్ రవి కూడా ఈ షో కంటెంట్ ను అందించినట్లు సమాచారం.

 మొదటి గెస్ట్ గా మోహన్ బాబు

మొదటి గెస్ట్ గా మోహన్ బాబు

ప్రముఖ సినీ తారలను బాలకృష్ణ తనదైన శైలిలో చాలా ఓపెన్ గా ఇంటర్వ్యూ చేస్తారట. సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కూల్ గా అనే ప్రశ్నలను అడగడానికి నందమూరి బాలయ్య సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇక అన్‌స్టాపబుల్ షోలో మొదట కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు బాలయ్యతో ఎలాంటి విషయాలు మాట్లాడతారో చూడాలి. దీపావళి రోజున మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే అవకాశం ఉందట.

అన్‌స్టాపబుల్ స్పెషల్ గెస్టులు

అన్‌స్టాపబుల్ స్పెషల్ గెస్టులు

గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణ ఆహా షో అన్‌స్టాపబుల్ స్పెషల్ గెస్టులు వీరే అంటూ ఒక ప్రత్యేకమైన రూమర్ కూడా వైరల్ అవుతోంది. ముందుగా మోహన్ బాబు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా పాల్గొంటారని టాక్ అయితే వచ్చింది. ఇక ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ మెగా హీరోలు మాత్రం కొందరు బాలయ్య టాక్ షోలో మనసువిప్పి మాట్లాడే అవకాశం ఉందట.

Recommended Video

Nandamuri Babulu Lyrical Song | D/o BuchiReddy Movie
బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే..

బాలయ్య రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక నందమూరి బాలకృష్ణకు అన్‌స్టాపబుల్ షోకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే మొత్తంగా ఆయనకు ఒక ఎపిసోడ్ కు 40 లక్షల వరకు అందుతుందట. మొత్తంగా 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వాటికి టోటల్ గా ఐదు కోట్ల వరకు బాలయ్యకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X